
బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్‌కు భారీ షాక్ తగిలింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కారణంగా కర్ణాటక ప్రభుత్వం బిగ్ బాస్ హౌస్‌ను సీజ్ చేసింది. కంటెస్టెంట్లు బయటకు రాగా, షో మేకర్స్ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామం కన్నడలో చర్చనీయాంశంగా మారింది.
Key Points
బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ హౌస్‌ను పర్యావరణ నిబంధనల ఉల్లంఘనతో కర్ణాటక ప్రభుత్వం సీజ్ చేసింది.
హౌస్ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండా బయట డ్రెయినేజీలో కలపడమే ప్రధాన కారణం.
కంటెస్టెంట్లను బయటకు పంపించి, స్టూడియో కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ చర్యలపై బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ (ఎండెమాల్ షైన్) సంస్థ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
బిగ్ బాస్ హౌస్ సీజ్: అసలు కారణం
హోరాహోరీగా సాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు దెబ్బ పడింది. ఈ పాపులర్ షో కన్నడ సీజన్ కు షాక్ తగిలింది. బిగ్ బాస్ 12 కన్నడ సీజన్ కు బ్రేక్ వచ్చింది. ఈ సీజన్ లో ఉన్న బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో కర్ణాటక ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పుడిది కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ కన్నడలో 12వ సీజన్ ఇటీవల సెప్టెంబర్ 28న స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ వీక్ నడుస్తోంది. ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ కు సీజ్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ హౌస్ లోని కంటెస్టెంట్లను బయటకు పంపించి అధికారులు సీజ్ వేశారని తెలిసింది. ఈ సీజన్ కు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్.
పర్యావరణ నిబంధనల ఉల్లంఘన: ప్రభుత్వ ఆదేశాలు
బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ హౌస్ ను సీజ్ చేయడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఈ బిగ్ బాస్ హౌస్ సెట్ బెంగళూరులోని జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ లో ఉంది. అయితే ఆ హౌస్ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండానే బయట డ్రెయినేజీలో కలిపేస్తున్నారని తెలిసింది. ఈ కారణంతోనే కర్నాటక కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వెళ్లి ఆ హౌస్ ను సీజ్ చేశారు.
కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని అనుమతులను ఆ స్టూడియో మేనేజ్ మెంట్ తీసుకోలేదని తెలిసింది. దీంతో పాటు మురుగు నీరు శుద్ధి చేయకుండా బయటకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక పర్యావరణ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వెంటనే స్టూడియో కార్యకలాపాలను ఆపేయాలని నోటీసులు ఇచ్చారు.
కోర్టును ఆశ్రయించనున్న మేకర్స్
మరోవైపు రామనాగర జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆ హౌస్ ఉన్న సెట్ ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకో వైపు పవర్ కట్ చేయాలని కూడా ఆదేశాలు వచ్చాయి.
బిగ్ బాస్ 12 కన్నడ సీజన్ కలర్స్ కన్నడ ఛానెల్లో టీవీల్లో ప్రసారమవుతుంది. జియోహాట్ స్టార్ లో ఓటీటీలో చూడొచ్చు. అయితే ఇప్పుడు సడెన్ గా హౌస్ కు సీజ్ వేయడం ఈ సీజన్ కు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ జియోహాట్ స్టార్ లో లేట్ గా స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ను ప్రొడ్యూస్ చేసే ఎండెమాల్ షైన్ సంస్థ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
బిగ్ బాస్ హౌస్ సీజ్ వ్యవహారం కన్నడ టీవీ చరిత్రలో ఒక సంచలనం. పర్యావరణ చట్టాల పట్ల నిర్లక్ష్యానికి ఇది ఒక గుణపాఠంగా నిలుస్తుంది. మేకర్స్ కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తుండగా, ఈ సీజన్ భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.


