|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుల్కర్ సల్మాన్‌తో శృతి హాసన్ లవ్ స్టోరీ లీక్.. చిన్ననాటి సీక్రెట్స్ వైరల్!

Published: 25-03-2026, 5:05 AM
దుల్కర్ సల్మాన్‌తో శృతి హాసన్ లవ్ స్టోరీ లీక్.. చిన్ననాటి సీక్రెట్స్ వైరల్!
  • కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
  • దుల్కర్ సల్మాన్, శృతి హాసన్ చెన్నైలోని ఒకే స్కూల్‌లో చాలా ఏళ్లు కలిసి చదువుకున్నారు – చిన్ననాటి స్నేహితులు!
  • స్కూల్ డేస్‌లో దుల్కర్ సల్మాన్ శృతిని ‘సోంబి’ అని పిలిచేవాడు – ఆసక్తికరమైన పాత జ్ఞాపకాలు వైరల్.
  • ‘ఆకాశంలో ఒక తార’ మూవీలో దుల్కర్, శృతి జంటగా నటిస్తున్నారు – త్వరలో విడుదల కానుంది!

టాలీవుడ్ నటి శృతి హాసన్, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు మాత్రమే కాదు, ఒకే స్కూల్లో చదువుకున్నారట! దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

దుల్కర్ సల్మాన్‌తో శృతి స్కూల్ డేస్ ముచ్చట్లు

కోలీవుడ్ దిగ్గజం కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్. కేవలం హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ భామ, తాజాగా ఒక క్రేజీ విషయాన్ని బయటపెట్టింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తనకు చిన్నప్పటి నుంచే తెలుసని, ఆయనతో తనకున్న స్పెషల్ బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి తాము ఓకే స్కూల్‌లో చాలా ఏళ్లు చదువుకున్నట్లు వెల్లడించింది. “మేము చిన్నప్పుడు చెన్నైలోని రెండు ప్రముఖ పాఠశాలల్లో కలిసి చదివాం. ఆ సమయంలో మేము తరచూ కలుసుకునేవాళ్లం. మా ఇద్దరి మధ్య అప్పటి నుంచే మంచి స్నేహం ఉంది” అని శృతి వెల్లడించింది. స్టార్ కిడ్స్ అయినప్పటికీ స్కూల్ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేవారమని ఆమె చెప్పుకొచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు దుల్కర్ సల్మాన్ శృతిని ఒక వింత పేరుతో పిలిచేవాడని గుర్తు చేసుకుంది.

“స్కూల్ డేస్‌లో దుల్కర్ నన్ను ‘సోంబి’ అని పిలిచేవాడు. దానికి ఒక కారణం ఉంది. అప్పట్లో నేను విద్యార్థులందరితో కలిసి ‘సోంబి’ అనే పాటను పాడాను. అది విన్నప్పటి నుంచి దుల్కర్ నన్ను అదే పేరుతో ఏడిపించేవాడు. విశేషం ఏంటంటే.. అప్పట్లో స్కూల్లో ఉన్న మిగతా పిల్లలకు నేను కమల్ హాసన్ కూతురిని అని మాత్రమే తెలుసు కానీ, నా పేరు శృతి అని చాలామందికి తెలియదు” అంటూ నవ్వుతూ పాత జ్ఞాపకాలను పంచుకుంది. చిన్నప్పుడు స్కూల్లో కలిసి అల్లరి చేసిన ఈ ఇద్దరు స్టార్ కిడ్స్, ఇప్పుడు వెండితెరపై జంటగా అలరించబోతున్నారు. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మూవీలో శృతి కీలక పాత్రలో కనిపించనుంది. పవన్ సాదినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా ఆధ్వర్యంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించగా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ దీనిని సమర్పిస్తున్నారు

చిన్నప్పుడు దుల్కర్‌తో శృతికి ఉన్న వింత అనుబంధం

వెండితెరపై దుల్కర్, శృతి జోడి.. మూవీ అప్‌డేట్స్

చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు వెండితెరపై కలిసి సందడి చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ మూవీలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.