|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘చిన్నా’ తర్వాత ‘3 BHK’ పేరుతో మరో మిడిల్ క్లాస్ సినిమా

Published: 13-05-2025, 10:10 AM
'చిన్నా' తర్వాత '3 BHK' పేరుతో మరో మిడిల్ క్లాస్ సినిమా

సినిమా పరిశ్రమలో కమర్షియల్ సినిమాలకు డిమాండ్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ‘చిన్నా’ తర్వాత ‘3 BHK’ అనే మరో మిడిల్ క్లాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శరత్ కుమార్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

Key Points

1

సిద్ధార్థ్ 'చిన్నా' తర్వాత మరో మిడిల్ క్లాస్ సినిమా '3 BHK'తో ప్రేక్షకుల ముందుకు

2

శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు

4

సిద్ధార్థ్ మళ్ళీ హిట్ కొడతాడా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న

సిద్ధార్థ్ కెరీర్‌లో మరో మిడిల్ క్లాస్ కథ

ఒకప్పటిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు అంటే అస్సలు సక్సెస్ కావట్లేదు. ఒకవేళ హిట్ అని డప్పుకొట్టినా సరే ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. దీంతో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్ లో ఓ స్టార్ హీరో వెళ్తున్నట్లు అనిపిస్తుంది.

‘3 BHK’ సినిమా విడుదల తేదీ

పైన ఫొటోలో శరత్ కుమార్ తో ఉన్నది సిద్ధార్థ్. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్స్ పడలేదు. తమిళంలోనూ చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ల క్రితం చిన్నా అనే మూవీతో అటు నటుడిగా మంచి పేరు వచ్చింది.

ఇప్పుడు మళ్లీ ఆ తరహాలోనే 3 BHK అనే మూవీ చేస్తున్నాడు. గతంలో చిన్నా చిత్రంలో కాస్త డీ గ్లామర్ గా కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అలానే కనిపించబోతున్నాడు. ఇందులో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మిడిల్ క్లాస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈసారి కూడా సిద్ధార్థ్ హిట్ కొడతాడేమో చూడాలి?

శరత్ కుమార్ ప్రధాన పాత్ర

చిన్నా సినిమా తర్వాత సిద్ధార్థ్‌కు మరో హిట్ అవకాశం ‘3 BHK’. జూలై 4న విడుదల అయ్యే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.