
గుంటూరు టాకీస్, డీజే టిల్లు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ, తాను నటించిన ‘జాక్’ సినిమా భారీ నష్టాలను చవిచూసింది. ఈ నష్టాలను భరించేందుకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Key Points
సిద్దు జొన్నలగడ్డ "జాక్" సినిమాకు వచ్చిన భారీ నష్టాలను భరించేందుకు నిర్మాతకు సగం పారితోషికం (రూ.4.75 కోట్లు) తిరిగి ఇచ్చారు.
యంగ్ హీరో సిద్దు యొక్క ఈ సంచలన నిర్ణయం సినీ పరిశ్రమలో విస్తృత ప్రశంసలను అందుకుంటోంది.
సిద్దు తీసుకున్న ఈ చర్య ఇతర యువ హీరోలు మరియు నిర్మాతలకు ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం "తెలుసు కదా" సినిమాలో నటిస్తున్న సిద్దు సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది.
జాక్ సినిమా ఫలితాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా ఉన్నప్పటికి గుంటూరు టాకీస్, డీజే టిల్లు (DJ Tillu) సినిమాలతో సిద్దు జోన్నలగడ్డకు హీరోగా మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ తీయగా భారీ విజయం సాధించి.. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. అయితే అదే ఊపులో “జాక్” అనే సినిమాను (“Jack” movie) తీసి విడుదల చేయగా.. ఆ సినిమా ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా పోటీ ఎక్కువగా ఉండటం, ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో కనీస కలెక్షన్లు కూడా జాక్ సినిమా రాబట్టలేకపోయిన విషయం తెలిసిందే. అయితే తాను హీరోగా నటించిన జాక్ సినిమా (“Jack” movie)కు భారీ నష్టాలు రావడంతో హీరో సిద్దు (Sidhu is the hero) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జాక్ సినిమాకు తాను తీసుకున్న పారితోషికం రూ.4.75 కోట్లలో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చాడు. ఈ విషయాన్ని బీఏ రాజు టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. నష్టాల్లో ఉన్న నిర్మాణ సంస్థను ఆదుకునేందుకు యంగ్ హీరో తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సిద్దు (sidhu) నిర్ణయం ఎందరో యువ హీరోలకు, ప్రొడ్యూసర్లకు ప్రేరణగా నిలుస్తుందని, ఈ నిర్ణయం ఆయన తర్వాత సినిమాలపై సానుకూల ప్రభావం చూపుతాయని, నిర్మాత దైర్యంగా సినిమాలు తీసే వాతావరణం నెలకొంటుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా సిద్దు ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది.
సిద్దు జొన్నలగడ్డ సంచలన నిర్ణయం
పరిశ్రమ స్పందన
సిద్దు జొన్నలగడ్డ చర్య సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలుస్తుంది. నిర్మాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఆయన తదుపరి సినిమాలకు ఇది మంచి పునాది వేస్తుంది.


