|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SKN: ‘ఓ నిర్మాత నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేశారు’.. ఎస్‌కేఎన్ కామెంట్స్ వైరల్!

Published: 16-06-2025, 7:24 AM
SKN: 'ఓ నిర్మాత నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేశారు'.. ఎస్‌కేఎన్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత ఎస్కేఎన్, సినిమాపై ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Key Points

1

ప్రభాస్ 'ది రాజా సాబ్' టీజర్ విడుదలైంది.

2

ఎస్‌కేఎన్ 'ది రాజా సాబ్' సినిమాకు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని ఆరోపించారు.

4

సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

‘ది రాజా సాబ్’ టీజర్ విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. రొమాంటిక్‌ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్న రోజు వచ్చేసింది. మన రాజా సాబ్‌ టీజర్‌ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్‌ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.

అయితే ఇవాళ నిర్వహించిన టీజర్‌ ఈవెంట్‌కు నిర్మాత ఎస్‌కేఎన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ టీజర్‌తో పాటు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్‌ చేశారని ఆరోపించారు. ఈ సినిమా మొదలైనప్పుడు నెగెటివ్‌ చేసినా నిర్మాత.. టీజర్ చూశాక రేపటి నుంచి పాజిటివ్‌ ట్రెండ్‌ చేస్తాడు. మారుతి ఎప్పుడూ అలాంటి క్యాంపెయిన్స్‌ను నమ్మలేదు. తన బెస్ట్‌ ఇస్తానని చెప్పాడు. డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా షేక్‌ అవుతుంది’ ఎస్‌కేఎన్‌ కామెంట్స్ చేశారు. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఎవరా? నిర్మాత టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.

ఎస్కేఎన్ ఆరోపణలు

సోషల్ మీడియాలో వైరల్

ఈ రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌లో  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.