|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: డ్రగ్స్ కేసులో సౌత్ హీరోయిన్ అరెస్ట్! సినీ ఇండస్ట్రీలో కలకలం!

Published: 06-02-2026, 7:30 AM
షాకింగ్: డ్రగ్స్ కేసులో సౌత్ హీరోయిన్ అరెస్ట్! సినీ ఇండస్ట్రీలో కలకలం!
  • చెన్నైలో డ్రగ్స్ దాడుల్లో సౌత్ హీరోయిన్ అంజు కృష్ణ, సహాయ దర్శకురాలు విన్సీ నివేత అరెస్ట్.
  • నిందితుల నుండి మెథాంఫెటమైన్, ఎల్ఎస్డీ స్టాంపులు, గంజాయి వంటి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
  • డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ANIU) దాడులు.
  • వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించబడిన నిందితులు; కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

సౌత్ సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. చెన్నైలో యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాడుల్లో సౌత్ హీరోయిన్ అంజు కృష్ణ, సహాయ దర్శకురాలు విన్సీ నివేతతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నైలో డ్రగ్స్ కలకలం

Drug Bust: సౌత్ సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఎంతో మంది సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి భారీగా డ్రగ్స్ గుట్టురట్టైంది. ఆ వివరాల్లోకి వెళితే.. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ANIU) చెన్నైలో నిర్వహించిన మెరుపు దాడుల్లో తమిళ, మలయాళ నటి అంజు కృష్ణ (Anju Krishna), తమిళ సహాయ దర్శకురాలు విన్సీ నివేత (Vincy Nivetha) పోలీసులకు చిక్కారు. వీరితో పాటు మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో మెథాంఫెటమైన్, LSD స్టాంపులు, గంజాయి వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ అంజు కృష్ణ (30), కో డైరెక్టర్ విన్సీ నివేత (26)తో పాటు వెంకటేష్ కుమార్ (31), విఘ్నేశ్వరన్ (33), కార్తీక్ రాజా (31), యశ్వంత్ (25), శ్రీరామ్ (33), అల్విబిన్షా (27) లను పోలీసులు అరెస్ట్ చేశారు.

సౌత్ హీరోయిన్, సహాయ దర్శకురాలు అరెస్ట్

చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ (Anti-Narcotics Intelligence Unit) అధికారులు రంగంలోకి దిగారు. తొలుత నెసపాక్కంకు చెందిన విఘ్నేశ్వరన్ (33) అనే వ్యక్తిని ఇన్‌స్పెక్టర్ జానీ చెల్లప్ప నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. అతడిని విచారించగా, పోరూర్ సమీపంలోని కోవూరుకు చెందిన వెంకటేష్ కుమార్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో వెంకటేష్‌ను పట్టుకోవడానికి పోలీసులు ఒక పక్కా ప్లాన్ వేశారు. ఒక పోలీసు అధికారి డెకాయ్ కస్టమర్ లాగా మారి అతడిని సంప్రదించారు. వలసరవాక్కం వద్ద డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెంకటేష్ తన కారులో రాగానే, పోలీసులు అతడిని చుట్టుముట్టారు. ఆ సమయంలో కారులో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్న వారిని సోదా చేయగా డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అరెస్ట్ అయిన వారి నుంచి 6 గ్రాముల మెథాంఫెటమైన్, 7 గ్రాముల OG గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి, ఒక స్మోకింగ్ బాంగ్, ఒక స్టాంప్, 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు

అరెస్టయిన వారందరినీ వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ముఠాకు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? సినీ పరిశ్రమలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నటి అంజు కృష్ణ విషయానికి వస్తే.. ‘వెల్లిమలై’, జోజు జార్జ్ నటించిన ‘ఆరో’ వంటి చిత్రాలతో గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే మలయాళంలో ‘సుమేష్ అండ్ రమేష్’, ‘ఆకాశం కడన్’ వంటి చిత్రాల్లోనూ ఆమె నటించారు. తాజాగా డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చూద్దాం మరి.. పోలీసుల విచారణలో ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో..

సౌత్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారాలు మళ్లీ తెరపైకి రావడంతో ఆందోళన నెలకొంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.