|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ నిజాలు చెప్పిన రాశి! నేను నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్‌ని, మిక్స్‌డ్ బ్రీడ్‌ని అంటూ సంచలనం!

Published: 23-03-2026, 9:35 PM
షాకింగ్ నిజాలు చెప్పిన రాశి! నేను నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్‌ని, మిక్స్‌డ్ బ్రీడ్‌ని అంటూ సంచలనం!
  • నటి రాశి తాను మిక్స్‌డ్ బ్రీడ్ అని, నాన్న బ్రాహ్మణుడు, అమ్మ గౌడాస్ అని చెప్పారు.
  • తాను నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ అని రాశి పేర్కొన్నారు.
  • 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నానని, గవర్నమెంట్ రూల్స్‌కు రెస్పెక్ట్ ఇచ్చానని రాశి అన్నారు.
  • పెళ్లి తర్వాత పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నానని తెలిపారు.

నటి రాశి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మిక్స్‌డ్ బ్రీడ్ అని, నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ అని ఆమె చెప్పడం విశేషం.

మిక్స్‌డ్ బ్రీడ్ గురించి రాశి కామెంట్స్

Actress Raasi: సెలబ్రిటీలనే వారు తమ క్యాస్ట్ ఏంటనేది చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే, అందరూ ఆదరిస్తేనే వారు చేసే సినిమాలు సక్సెస్ అవుతాయి. అందుకే, క్యాస్ట్ అనే పదం చాలా అరుదుగా సినీ సెలబ్రిటీల నోటి నుంచి వినబడుతుంది. వాళ్లు చెప్పకపోయినా, ఏదో ఒక సందర్భంలో అది రివీల్ అవుతుందనుకోండి. కానీ, ఇప్పుడు నటి రాశి (Actress Raasi).. డేరింగ్ తన క్యాస్ట్ ఏంటో చెప్పేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఏజ్ పెద్దగా ఉండటానికి ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొందరు ఇంజక్షన్స్ తీసుకుంటారట కదా! అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాశి అసలు వెనకాడకుండా సమాధానం ఇచ్చేశారు. ఎందుకంటే, అప్పట్లో రాశిపై ఇలాంటి వార్తలే బాగా వైరల్ అయ్యేవి. మరి ఈ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ..

నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ అని వెల్లడి

‘‘నాకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగింది. నాకు 22వ సంవత్సరం నడుస్తున్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. అది మ్యారేజ్ వయసే కదా. గవర్నమెంట్ కూడా 21 సంవత్సరాలకు పెళ్లి చేసుకోమని చెబుతుందిగా. 21 క్రాస్ అయి, 22 వచ్చిన తర్వాత పెళ్లి (Raasi Marriage Age) చేసుకున్నాను. గవర్నమెంట్ రూల్స్‌కు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏజ్ ఏదో పెద్దగా కనిపించడానికి ఇంజక్షన్స్ అవి, ఇవి తీసుకుంటారని అంటుంటారు కానీ, నా లైఫ్‌లో మాత్రం అంత సీన్ జరగలేదు. నేను మిక్స్‌డ్ బ్రీడ్. నాన్న బ్రాహ్మిణ్, అమ్మ గౌడాస్.. అలా మిక్స్‌డ్ బ్రీడ్ (mixed breed) నేను. ఈ మధ్య గవర్నమెంట్ చెబుతున్న ప్రకారం నాన్న ఏదైతే, అదే మనకు సంక్రమిస్తుందని చెబుతుంది కాబట్టి.. నేను బ్రాహ్మిణే. నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్. సినిమా ఇండస్ట్రీలో నాన్ వెజ్ తినకపోతే అవదు. నేనే కాదు, ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు’’ అని రాశి కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు.

సినిమా ఇండస్ట్రీలో రాశి రీ ఎంట్రీ

ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఎవరెవరు నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ ఇండస్ట్రీలో ఉన్నారా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. రాశి పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. పెళ్లి, పిల్లలతో హ్యాపీగా ఉన్న రాశి, పిల్లలు పెద్దవాళ్లు కావడంతో.. మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అత్త, అమ్మ, అక్క పాత్రలు పోషించే వారు చాలా తక్కువయ్యారు కాబట్టి, ఇలా రీ ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లకు చేతి నిండా పని దొరికే అవకాశం ఉంది. ఆల్రెడీ ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో రాశి బుల్లితెరపై సక్సెస్ అందుకున్నారు. వెండితెరపై కూడా ఆమె తన వరకు వచ్చిన పాత్రల్లో మంచి వాటిని సెలక్ట్ చేసుకుంటున్నారు.

రాశి తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.