
టాలీవుడ్ నటి శ్రీలీల ప్రస్తుతం కన్నడ చిత్రం ‘జూనియర్’ లో నటిస్తోంది. ఈ సినిమాలోని ఆమె పాట వైరల్ అవుతుండగా, తాజాగా ఆమె అమ్మమ్మతో చేసిన ఫన్నీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
శ్రీలీల తన అమ్మమ్మతో చేసిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో శ్రీలీలను 'వైరల్ వయ్యారి' అని పిలుస్తున్నారని అమ్మమ్మ అంటుంది.
జూనియర్ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ పుష్ప-2 రేంజ్ లో వైరల్ అవుతోంది.
నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోకి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీలీల-అమ్మమ్మ వైరల్ వీడియో
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఇటు తెలుగులో .. అటు కన్నడలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది . తెలుగులో వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ .. ప్రస్తుతం కన్నడ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది . గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వస్తోన్న చిత్రం జూనియర్ . ఈ మూవీలో జెనీలియా కీలక పాత్రలో కనిపించనుంది . ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది .
జూనియర్ సినిమా పాట వైరల్
అయితే ఈ సినిమాలో ఓ క్రేజీ సాంగ్ పుష్ప -2 రేంజ్ లో వైరలైంది . పుష్పలో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ ను తలపించింది . వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ ను ఓ ఊపు ఊపేసింది . దీంతో ఎ క్కడ చూసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ తెగ వైరలవుతోంది .
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
అయితే తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . తన అమ్మమ్మతో చేసిన ఫన్నీ వీడియో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది . అమ్మమ్మ నిన్ను అందరు వైరల్ వయ్యారి అంటున్నారు అని శ్రీలీల చెప్పగా .. నన్నెందుకు అంటారు .. నన్ను ఎవరు అనరు .. నిన్నే కదా అనేది అంటూ నవ్వుతూ మాట్లాడింది . ఇది చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు .
శ్రీలీల మరియు ఆమె అమ్మమ్మ మధ్య ఫన్నీ సంభాషణతో కూడిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోతో పాటు జూనియర్ సినిమాలోని ఆమె పాట కూడా వైరల్ గా మారడం విశేషం.


