|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి!

Published: 29-09-2025, 9:54 AM
అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి!

శరన్నవరాత్రులలో అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ దేవిని ఆరాధించడం వల్ల విద్యాబుద్ధులు, తెలివితేటలు సిద్ధిస్తాయి.

Key Points

1

శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అవతారం.

2

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

4

భక్తుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే శక్తి స్వరూపిణి.

మూలా నక్షత్రం ప్రాశస్త్యం

ఈరోజు మూలా నక్షత్రం అందుకే ఈ రోజు కనకదుర్గా దేవి సరస్వతీ దేవీ మాత రూపంలో దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రులలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూలా నక్షత్రం రోజైన ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ విద్యాబుద్ధులు ప్రసాదిస్తుంది.

మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం

మూలా నక్షత్రం అనగా జగన్మాత జన్మనక్షత్రం. అందుకే ఈరోజు ఎంతో ప్రాశస్త్యం కలిగిన రోజుగా భావిస్తారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో అర్ధరాత్రి నుండే కిటకిటలాడుతోంది. సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేస్తే.. విద్యాబుద్ధులు, చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం.. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికీ శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో అలంకరించబడుతుంది.

మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి. శ్రీ సరస్వతీ దేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.

శ్రీ అగస్త్య మునిప్రోక్త సరస్వతీ స్తోత్రమ్

సరస్వతీ నమ స్తుభ్యం సర్వదేవీ నమో నమః

శాంతరూపే శశిదరే సర్వయోగే నమో నమః

నిత్యానందే నిరాదారే నిష్కళాయే నమో నమః

విద్యాధరే విశాలక్షీ శుధ్దజ్ఞానే నమో నమః

శుద్ద స్పటిక రూపాయై సూక్ష్మరూపే నమో నమః

శబ్ద బ్రహ్మ చతుర్హస్తే సర్వసిద్దై నమో నమః

ముక్తాలంకృత సర్వాంగై మూలాదారే నమో నమః

మూలమంత్ర స్వరూపాయై మూలశక్యై నమో నమః

మనోన్మని మహాయోగే వాగీశ్వరీ నమో నమః

వాగ్మ్యైవరద హస్తాయై వరదాయై నమో నమః

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా

యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా

ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవి దర్శనం

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవ్యై స్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

దోర్భి ర్యుక్తా చతుర్భిః స్పటిక మణి నిభై రక్ష్మాలా స్తదానా

హస్తే నైకేన పద్మం సిత మపి చ శుకం పుస్తకం చాపరేణ

భాసా కుందేందు శంఖస్ఫటిక మణి నిభా భాసమానా సమానా

సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా

సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయ పుస్తకా

విరించి పత్నీ కమలాసన స్థితా సరస్వతీ నృత్యుతు వాచిమే సదా

సరస్వతీ సరసిజ కేసర తపస్విని సిత కమలాసినీ ప్రియా

ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః

గుణదోష వివర్జిన్యై గుణదీప్యై నమో నమః

సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః

సంపన్నయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః

యోగానార్య ఉమాదైవ్యై యోగానందే నమో నమః

దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః

అర్ధచంద్ర జటాధారి చంద్ర బింబే నమో నమః

సరస్వతీ పూజ వల్ల కలిగే లాభాలు

చంద్రా దిత్య జటాధారి చంద్ర బింబే నమో నమః

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః

అణీమాద్యష్ట సిద్దాయై ఆనందాయై నమో నమః

జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞాన మూర్తే నమో నమః

నా శాస్త్ర స్వరూపాయై నా రూపే నమో నమః

పద్మదా పద్మవంశా చ పద్మ రూపే నమో నమః

పరమేష్ట్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః

బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మణార్యై నమో నమః

కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః

కపాలి కర్మ దీప్తాయై కర్మదాయై నమో నమః

పఠేన్నిత్యం షాణ్మాసాత్సిద్ది రుచ్యతే

చోర వ్యాఘ్ర భయం పఠ్యతాం శృణ్వతా మపి

ఇట్థం సరస్వతీ స్తోత్ర మగస్త్యముని వాచకం

సర్వసిద్ది కరం నృణాం సర్వపాప ప్రణాశనం

ఇతి శ్రీ అగస్త్య మునిప్రోక్త సరస్వతీ స్తోత్రమ్ సమాప్తం..

శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం. మూలా నక్షత్రం పుణ్యదినాన అమ్మవారిని సేవించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. జ్ఞానం, వివేకం కోరుకునే భక్తులకు ఇది ఒక గొప్ప అవకాశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.