|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ! జూలై 9న ‘శ్రీనివాస మంగాపురం’ సంచలనం!

Published: 30-05-2026, 5:00 PM
ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ! జూలై 9న 'శ్రీనివాస మంగాపురం' సంచలనం!
  • అజయ్ భూపతి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కుతోంది.
  • సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు.
  • ఇది ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జూలై 9న విడుదల కానుంది.
  • కృష్ణ గారి వారసుడిని లాంచ్ చేయడంపై అజయ్ భూపతి బాధ్యతను పంచుకున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 9న విడుదల కానుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ

Srinivasa Mangapuram : టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ సమర్పణలో, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రెజెంటేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి వైవిధ్యమైన, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన అజయ్ భూపతి, ఈసారి రూట్ మార్చి ఒక ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఒక సరికొత్త జంట పరిచయం కానుంది.

జూలై 9న  విడుదల కానున్న సినిమా

అజయ్ భూపతి కొత్త ప్రయోగం

రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయ కృష్ణ ఈ చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండగా, ఆయన సరసన రాశ తడాని  హీరోయిన్‌గా నటిస్తోంది.  జూలై 9న  థియేటర్లలో  వస్తుండటం తో ఈ జోడీ  సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని ఇప్పటి నుండే అంచనాలు పెంచేసుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.ఇక ఇటీవల చిత్ర బృందం వైభవంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో దర్శకుడు అజయ్ భూపతి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.

షూటింగ్ లో ఎమోషనల్ ఇన్సిడెంట్

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోను లాంచ్ చేయడంపై ఆయన స్పందిస్తూ, ఇది సాధారణ విషయం కాదని, దీని వెనుక ఎంతో బాధ్యత, వెయిట్ ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల చరిత్ర గురించి మాట్లాడితే కృష్ణ గారి ప్రస్తావన లేకుండా ఆ చర్చ ఎప్పటికీ ముగియదని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలో దశాబ్దాల పాటు కొనసాగినప్పటికీ ఆయన గురించి ఎవరూ ఎప్పుడూ ఒక్క నెగెటివ్ మాట కూడా మాట్లాడటం తాను చూడలేదని, అంతటి క్లీన్ అండ్ లెజెండరీ ప్రొఫైల్ ఆయనదని ఆకాశానికి ఎత్తేశారు.

శ్రీనివాస మంగాపురం చిత్రం జూలై 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో, జయకృష్ణ అరంగేట్రంతో వస్తున్న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.