
దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కట్టప్ప పాత్ర, బాహుబలి సినిమా అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
'బాహుబలి: ది ఎపిక్' అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.
రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి ఇచ్చిన సరదా ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయింది.
కట్టప్ప బాహుబలిని చంపేందుకు సిద్ధపడటం తనను ఎక్కువగా ప్రభావితం చేసిందని రాజమౌళి అన్నారు.
ఈ పదేళ్లలో బాహుబలి షూటింగ్ అనుభవాలను ముగ్గురు గుర్తు చేసుకున్నారు.
‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన మ్యాజిక్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ రెండు చిత్రాలను ఓకేసారి వీక్షించేలా బాహుబలి ది ఎపిక్(Baahubali : The Epic) పేరుతో రానున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
రాజమౌళి, ప్రభాస్, రానా సరదా ఇంటర్వ్యూ
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళితో హీరోలు ప్రభాస్, రానా కలిసి సరదాగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తాజాగా ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
కట్టప్పపై రాజమౌళి వ్యాఖ్యలు
ఈ లేటేస్ట్ ప్రోమోలో ఈ పదేళ్లలో మీ అనుభవం ఏంటి? అని రాజమౌళిని ప్రభాస్ అడిగారు. దీనికి బదులిస్తూ.. బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. అతన్ని చంపేందుకు కట్టప్ప సిద్ధపడటమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాల్లోని సీన్స్‌ను గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా కనిపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
రాజమౌళి ‘కట్టప్ప ఆ పనికి సిద్ధం కావడమే’ అంటూ చేసిన వ్యాఖ్యలు బాహుబలి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా విడుదలపై అంచనాలను పెంచుతున్నాయి.


