|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ, లయల కలయికలో ‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’.. ఊహించని విడుదల తేదీ ప్రకటన!

Published: 18-02-2026, 8:35 AM
శివాజీ, లయల కలయికలో 'సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని'.. ఊహించని విడుదల తేదీ ప్రకటన!
  • శివాజీ, లయ జంటగా ‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ సినిమా విడుదల కానుంది.
  • ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
  • మార్చి 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
  • ఇదే రోజున ఇతర సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

శివాజీ మరియు లయ మరల జంటగా ‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొదట ఓటీటీలో విడుదల చేయాలనుకున్నప్పటికీ, ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శివాజీ లయల రీఎంట్రీ మూవీ

SSS Film Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్లకు జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇలా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జంటలలో సీనియర్ నటుడు శివాజీ(Sivaji) లయ(Laya) జంట కూడా ఒకటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే తాజాగా మరోసారి శివాజీ లయ జంటగా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని (Sampradayini Suppini Suddapoosani ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఈటీవీ విన్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు ఇలా ఓటీటీలో ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు అదే దిశగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు . అయితే ఉన్నఫలంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ ఓటీటిలో కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమయ్యారని తెలుస్తోంది. పలువురు సెలబ్రిటీలకు ఈ సినిమా చూపించడంతో ఇంత మంచి సినిమాని థియేటర్లలో విడుదల చేయడమే మంచిదని సలహాలు ఇవ్వటంతోనే చిత్ర నిర్మాతలు చివరి క్షణంలో నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది.

ఇందుకు అనుగుణంగానే ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మార్చి 6వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీన అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ల ద్వారా తెలియజేశారు. దీంతో మార్చ్ 6 తేదీ ఈ సినిమా థియేటర్ విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇక మార్చి ఆరో తేదీ పలు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.

The iconic pair @ActorSivaji & #Laya all set to create magic once again ✨

థియేటర్లలో విడుదల నిర్ణయం

A vintage reunion packed with fun, laughter, and full on madness ❤️‍🔥 #SampradayiniSuppiniSuddapoosani coming to theatres on March 6th 🤩

Trailer – https://t.co/jRxFhFUIr3

An @etvwin Original Production pic.twitter.com/Ue1PUwuKni

మార్చి 6న విడుదల కానున్న సినిమాలు

— SreeSivajiProductions (@SreeSivajiprods) February 18, 2026

మార్చి 6వ తేదీ లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, మాన్షన్ హౌస్ మల్లేష్ వంటి సినిమాలో కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక ఇప్పటికే శివాజీ సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ రోషన్ మరోసారి శివాజీ కొడుకు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వి రాజ్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వర్ష సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. శివాజీ దండోరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

చివరిగా, శివాజీ మరియు లయల కలయికలో వస్తున్న ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.