
ప్రముఖ నటుడు చంకీ పాండే తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్ళగా అది అంత్యక్రియలు అని తెలిసి షాక్ అయ్యాడు.
Key Points
స్టార్ నటుడు చంకీ పాండే అంత్యక్రియలకు హాజరైన విషయం
డబ్బుల కోసం అంత్యక్రియలకు వెళ్ళడం
చంకీ పాండే స్వయంగా ఈ సంఘటనను వెల్లడించడం
చంకీ పాండే ఆసక్తికర వెల్లడి
బ్యూటిఫుల్ అనన్యా పాండే తండ్రి చంకీ పాండే ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న నటుడే. కానీ తర్వాత ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. లైగర్‌లో ఆమెకు తండ్రిగా నటించిన ఆయన.. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్‌లోనూ ప్రత్యక్షమవుతాడు. ఈ మధ్య ఓ అవార్డు ఫంక్షన్‌లో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ ఇరగదీసి వైరల్ అయ్యారు కూడా. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు చంకీ. తను సినిమాల్లో బిజీగా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ నవ్వుకున్నాడు.
‘ఆ కాలంలో సోషల్ మీడియా, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి ఏమీ లేవు. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా డబ్బు సంపాదించలేం. యాడ్స్ కూడా ఎక్కువగా ఉండేవి కావు. సినిమాలు, ఈవెంట్స్ చేయడం వల్లనే డబ్బులు వచ్చేవి. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ ఆర్గనైజర్ కాల్ చేసి ఇక్కడ ఈవెంట్ ఉంది వెంటనే రండి అని కాల్ చేశాడు. నేను షూటింగ్‌లో బిజీగా ఉన్నా అంటే మీరు వెళ్లే దారిలోనే వచ్చి వెళ్లండి అన్నాడు. వైట్ డ్రెస్ వేసుకుని రండి అని చెప్పాడు. అది ఈవెంట్ థీమ్ అనుకుని ఓకే అన్నా. వెళ్లేసరికి అందరూ సాడ్‌గా ఉన్నారు. ఎదురుగా డెడ్ బాడీ ఉంది. దీంతో నన్ను పిలిచిన ఆర్గనైజర్ చనిపోయాడుకున్నా. కానీ నేను వెళ్లింది అంత్యక్రియలకు అని తర్వాత అర్థమైంది. నాకు ఫోన్ చేసిన ఆర్గనైజర్ నా దగ్గరకు వచ్చి ఎక్కువ ఏడిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పడంతో షాక్ అయ్యా’ అని స్వయంగా తానే చెప్పుకొచ్చాడు.
అంత్యక్రియలకు హాజరు కావడం వెనుక రహస్యం
వైరల్ అవుతున్న వీడియో
చివరికి, చంకీ పాండే తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా, సినిమా ఇండస్ట్రీలోని కొన్ని కష్టకాలను ప్రేక్షకుల ముందుంచాడు. ఈ ఘటన వైరల్ అవుతూ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.


