
📌 Key Points
- శివరాజ్ కుమార్ ’45’ సినిమా ప్రమోషన్లలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు.
- ప్రాణాంతక సర్జరీ తర్వాత బతుకుతానో లేదో అని భయపడ్డానని భావోద్వేగమయ్యారు.
- రాజకీయాలపై తన అభిప్రాయాలను, నిస్వార్థ సేవ గురించి పంచుకున్నారు.
- ‘జైలర్-2’లో నటిస్తున్నట్లు, తన షూటింగ్ షెడ్యూల్ వివరాలు స్పష్టం చేశారు.
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రాణాంతక సర్జరీ, రాజకీయాలు, అలాగే తన రాబోయే సినిమా ’45’ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సర్జరీ తర్వాత జీవితం పట్ల తన దృక్పథం ఎలా మారిపోయిందో భావోద్వేగంగా పంచుకున్నారు. ‘జైలర్-2’లో నటిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.
శివరాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ త్వరలో ‘45’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అర్జున్ జన్య (Arjun Janya)దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలోఉపేంద్ర, రాజ్ బి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి రానుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన శివరాజ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ఆయన పలు విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు రాజకీయాలు తెలియవు. నేను చేయగలిగిన సహాయం ఏదైతే ఉందో, అది నేను ఇప్పటికే చేస్తున్నాను. దాని కోసం నాకు అధికారం అవసరం లేదు.
ప్రాణాంతక సర్జరీపై భావోద్వేగం
నేను పక్షపాతం లేకుండా ఎవరికైనా సహాయం చేయగలను. కానీ రాజకీయాల్లో అలా జరగదు. కేవలం కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. అది నా సొంత డబ్బు కాబట్టి నేను ఎవరికైనా సహాయం చేయగలను’’ అని అన్నారు. ఆ తర్వాత తనకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. ‘‘ఆపరేషన్‌కు వెళ్లే ముందు, నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను తిరిగి వస్తానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఐదు గంటల ఆపరేషన్ తర్వాత, నేను నా భార్య చేతిని పట్టుకుని, ‘నిన్ను మళ్ళీ చూస్తానని నేను ఊహించలేదు’ అని చెప్పాను.
‘జైలర్-2’పై బిగ్ అప్డేట్
ఆ తర్వాత నా ప్రపంచం మొత్తం మారిపోయింది. డబ్బు ఈరోజు లేదా రేపు రావచ్చు, కానీ ఆ ప్రేమ అంతా నా జీవితాంతం నాతోనే ఉంటుంది’’ అని పెర్కోన్నారు. అలాగే తాను ‘జైలర్-2’ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ‘‘నేను జైలర్-2 సినిమాలో నటిస్తున్నాను. నా షూటింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఇది మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. మొదటి భాగాన్ని అనుసరించి, నా పాత్ర ప్రవేశం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. నేను జనవరి 6, 8, 9, మరియు 10 తేదీల మధ్య నా షూటింగ్‌ను పూర్తి చేస్తాను’’ అన్నారు.
శివరాజ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. జీవితం పట్ల ఆయనకున్న నిబద్ధత, సినిమాల పట్ల ఆయనకున్న అంకితభావం ఈ సంభాషణలో స్పష్టంగా కనిపించాయి. ‘జైలర్-2’లో ఆయన పాత్ర కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


