|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`కలిసుందాం రా` సినిమాని మిస్‌ చేసుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? `సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్‌

Published: 23-09-2025, 11:47 AM
`కలిసుందాం రా` సినిమాని మిస్‌ చేసుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? `సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్‌

వెంకటేష్ హీరోగా నటించిన ‘కలిసుందాం రా’ సినిమా సంచలన విజయం సాధించింది. కానీ ఈ సినిమా మొదట మరో స్టార్ హీరోకు అందినప్పటికీ, ఆయన వదులుకున్నాడు. ఆ హీరో ఎవరో మరియు ఈ సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసుకుందాం.

Key Points

1

నాగార్జున 'కలిసుందాం రా' సినిమాను వదులుకోవడం

2

వెంకటేష్‌ సినిమా విజయం మరియు రికార్డులు

4

సమరసింహారెడ్డి రికార్డులను బ్రేక్ చేసింది

నాగార్జున ఎందుకు వదులుకున్నాడు?

వెంకటేష్‌ హీరోగా వచ్చిన `కలిసుందాం రా` మూవీ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇందులో వెంకటేష్‌కి జోడీగా సిమ్రాన్‌ నటించింది. తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ దర్వకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ గా నిలవడమే కాదు, ఇండస్ట్రీ హిట్‌ జాబితాలో చేరిపోయింది. అయితే ఈ మూవీకి చేయాల్సిన మొదటి హీరో వెంకటేష్‌ కాదు. మరో సూపర్‌ స్టార్‌ వదులుకుంటే వెంకీ వద్దకు వచ్చింది.

తమిళ దర్శకుడు ఉదయ్‌ శంకర్‌ `కలిసుందాం రా` అనే ఫ్యామిలీ కథని రెడీ చేసుకుని వచ్చి మొదట నాగార్జునని కలిశారు. అయితే అప్పటికే నాగార్జున వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేశారు. `చంద్రలేఖ`, `సీతారామరాజు` వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. మళ్లీ ఫ్యామిలీ సినిమా అంటే బోర్‌ కొడుతుందని, ఆడియెన్స్ చూడరని భావించారు నాగ్‌. దీంతో ఈ కథకి నో చెప్పారు. అలా నాగార్జున `కలిసుందాం రా` సినిమాని వదులుకున్నారు. అయితే ఇది చాలా చిన్న కారణం. నిజానికి నాగ్‌ సినిమా చేసి ఉంటే ఆయన ఇండస్ట్రీ హిట్‌ని అందుకునేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

వెంకటేష్‌ విజయం వెనుక కథ

నాగార్జున నో చెప్పడంతో ఈ కథతో వెళ్లి వెంకటేష్‌ని కలిశాడు దర్శకుడు ఉదయ్‌ శంకర్‌. అప్పటికే వరుసగా ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు వెంకీ. వరుసగా విజయాలు అందుకుంటున్నారు. పైగా కెరీర్‌ పరంగానూ పీక్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకటేష్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ స్టోరీకి వెంకీనే న్యాయం చేస్తాడని భావించారు ఉదయ్‌ శంకర్‌. లక్కీగా వెంకీకి, సురేష్‌ బాబుకి నచ్చింది. దీంతో తమ సురేష్‌ ప్రొడక్షన్‌లోనే ఈ సినిమా చేశారు.

2000లో జనవరి 14న విడుదలైంది. ఫ్యామిలీ కంటెంట్‌ ఉన్న సినిమా కావడం, పైగా సంక్రాంతి పండగ కావడంతో ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` కి ఎలా అయితే ఆడియెన్స్ క్యూ కట్టారో. అప్పుడు కూడా అదే స్థాయిలో ఆడియెన్స్ బండ్లు కట్టుకుని వెళ్లి సినిమా చూశారు. దీంతో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ చిత్రం బ్రేక్‌ చేసింది. సంచలన విజయం సాధించింది. ఏకంగా సుమారు రూ. 27కోట్ల కలెక్షన్లని రాబట్టింది.

రికార్డులను బ్రేక్ చేసిన ‘కలిసుందాం రా’

అంతకు ముందు ఏడాది బాలకృష్ణ నటించిన `సమరసింహారెడ్డి` మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది వెంకీ `కలిసుందాం రా`. ఫ్యామిలీ కంటెంట్‌తో వస్తే ఏ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందో నిరూపించింది. ఈ సినిమా 76సెంటర్లలో వంద రోజులు, 17 సెంటర్లలో 175 రోజులు, మూడు సెంటర్లలో రెండు వందల రోజులు ప్రదర్శించడం విశేషం. అంతేకాదు ఆ ఏడాదికిగానూ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. నాలుగు నంది అవార్డులను దక్కించుకుంది.

చివరగా, ‘కలిసుందాం రా’ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ సినిమాలకు ఉన్న డిమాండ్ ను ఈ సినిమా మరోసారి నిరూపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.