|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కూతురు పుట్టాక వెయ్యి కోట్ల కొల్లలు: ఈ స్టార్ హీరోల సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

Published: 17-02-2026, 1:35 AM
కూతురు పుట్టాక వెయ్యి కోట్ల కొల్లలు: ఈ స్టార్ హీరోల సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
  • కూతురు పుట్టిన తర్వాత యష్ నటించిన కేజిఎఫ్ సినిమా 1000 కోట్లు వసూలు చేసింది.
  • రణబీర్ కపూర్ కూతురు పుట్టిన తర్వాత యానిమల్ మూవీ 1000 కోట్ల క్లబ్‌లో చేరింది.
  • రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించింది.
  • కూతురు పుట్టాక అదృష్టం కలిసి వచ్చిన కొందరు హీరోల గురించి ఈ కథనం.

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం. కూతురు పుట్టిన తర్వాత కొందరు స్టార్ హీరోల జీవితాలు మారిపోయాయి. వెయ్యి కోట్ల సినిమాల్లో నటించి రికార్డులు సృష్టించిన ఆ హీరోలు ఎవరో చూద్దాం.

కూతురు పుట్టాక వెయ్యి కోట్లు కొట్టిన యష్ సక్సెస్ స్టోరీ!

Celebrities : సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రావాలన్నా.. నేషనల్ లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకోవాలన్న కూడా అదృష్టం ఉండాలి. టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది అన్నది నిజం.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలి అంటే కచ్చితంగా చాలా కష్టపడాలి.. స్టార్ కిడ్స్, సినీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు సైతం క్రేజ్ కోసం ఆరాటపడుతున్నారు.. అయితే ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొనసాగుతున్న హీరోలకు కూతుర్లు పుట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చింది. హార్డ్ వర్క్‌తో వచ్చిన అదృష్టమో కానీ ఈ హీరోలకు కూతురు పుట్టాక తలరాత మారిపోయింది.. కూతురు పుట్టిన తర్వాత చేసిన సినిమాలు 1000 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు ని బ్రేక్ చేశాయి.. అలా కూతురు పుట్టిన తర్వాత 1000 కోట్ల సినిమాలలో నటించిన స్టార్ హీరోలు ఎవరు అన్నది ఒకసారి తెలుసుకుందాం..

కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ ని సంపాదించుకున్న స్టార్ హీరోలలో యష్ ఒకరు.. కేజిఎఫ్ సినిమాతో రాకింగ్ స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ ఒక్క మూవీ అతని లైఫ్ ను మార్చేసింది. సినిమా వెయ్యి కోట్ల మార్కెట్ చేసిందని సమాచారం. యష్ కు కూతురు ఐరా 2018 డిసెంబర్ 2న పుడితే.. అదే ఏడాదిలో కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ డిసెంబర్ 21న విడుదల అయింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా 1000 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

రణబీర్ కపూర్ కెరీర్ లో కూతురు అడుగుపెట్టాక వచ్చిన మార్పులు!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. మొదటి నుంచి వరుసగా సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తున్న ఈ హీరో కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టిన మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈయన నటించిన యానిమల్ రిలీజ్ అయింది.. గతంలో ఎన్నడూ ఏ సినిమాకు అందుకొని విధంగా ఈ సినిమాకు 1000 కోట్లు రావడం విశేషం.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ 2 సినిమాలో నటిస్తున్నాడు.

బాలీవుడ్ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరో రణవీర్ సింగ్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈ హీరో రీసెంట్గా దురంధర్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ మూవీ ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె జంటకు కూతురు దువా పదుకొణె సింగ్ 2024 సెప్టెంబర్ 8న పుట్టింది.. ఆయన కూతురు పుట్టిన ఏడాదికి గత ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అయింది. ధురంధర్ సినిమాకు ఏకంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే…

రణవీర్ సింగ్ దురంధర్ మూవీ వెనుక ఉన్న అసలు రహస్యం!

ఈ హీరోలంతా కూడా గతంలో ఎన్ని హిట్ సినిమాలలో నటించిన కూడా.. కూతుర్లు పుట్టిన తర్వాత ఒకేసారి 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హీరోల తలరాతల్ని కూతుర్లు మార్చేశారు అని చెప్పాలి.. ప్రస్తుతం ఈ హీరోలు అందరూ కూడా వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

కూతురు పుట్టిన తర్వాత అదృష్టం కలిసి వచ్చిన ఈ హీరోలు మరింతమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వారి విజయాలు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.