|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కడ భర్త పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్

Published: 30-05-2025, 12:54 AM
అక్కడ భర్త పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్

తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన నయనతార తాజాగా తన కుటుంబంతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా, నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Key Points

1

నయనతార తన భర్త, విఘ్నేష్ శివన్ మరియు ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

2

ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

4

నయనతార ప్రస్తుతం 'మెగా-157' మరియు 'అమ్మోరు-2' చిత్రాల్లో నటిస్తోంది.

నయనతార ఫ్యామిలీ ఫోటోస్ వైరల్

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన ‘మెగా-157’(Mega-157) మూవీలో నటిస్తోంది. ఇక దీనికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ‘అమ్మోరు-2’(Ammoru-2) చిత్రంలో కూడా యాక్ట్ చేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ప్రేక్షకుల స్పందన

ఇదిలా ఉంటే.. నయనతార కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌(Vignesh Shivan)తో ప్రేమలో పడి గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. ఇక సరోగసీ ద్వారా ఈ జంట ఇద్దరు బాబులకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక అప్పటినుంచి భర్త పిల్లలతో ఈ ముద్దుగుమ్మ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తన భర్త, పిల్లలతో(ట్విన్స్) ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నయన్ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

నయనతార తాజా సినిమా ప్రాజెక్టులు

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

నయనతార కుటుంబంతో ఆనందంగా గడుపుతున్న ఫోటోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె వృత్తి జీవితం, కుటుంబ జీవితం రెండింటినీ సమతుల్యంగా సాగిస్తుందని ఈ ఫోటోలు సూచిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.