
కన్నడలో విడుదలై సంచలన విజయం సాధించిన ‘సు ఫ్రమ్ సో’ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ వేదికైన జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూ.40 కోట్ల వసూళ్లు సాధించిన ఈ హారర్ కామెడీ చిత్రం..
Key Points
కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రమ్ సో’ తెలుగులో విజయవంతమైన ప్రదర్శన.
జియోహాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్.
కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూ.40 కోట్లు వసూళ్లు.
హారర్ కామెడీ జోనర్‌లో సూపర్ హిట్ చిత్రం ఓటీటీకి రానుంది.
‘సు ఫ్రమ్ సో’ తెలుగు ఓటీటీ ప్రయాణం
ఈ మధ్య కాలంలో డబ్బింగ్ మూవీలు తెలుగులో రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఇదే క్రమంలోనే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘సు ఫ్రమ్ సో’ ఆగస్టు 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధం అయింది. ఈ హారర్ కామెడీ చిత్రం జియోహాట్‌స్టార్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌లో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపారు టీమ్. షనీల్ గౌతమ్, సంధ్య, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి జేపీ తుమినాడ్ దర్శతక్వం వహించాడు. కేవలం రూ. 6 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం చాలా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 40 కోట్లు వసూళ్లు రాబట్టి సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం కావడంతో ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ వివరాలు
బాక్సాఫీస్ విజయం, ఓటీటీ ఆసక్తి
‘సు ఫ్రమ్ సో’ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో, ప్రేక్షకులు తమ ఇళ్లలోనే ఈ హారర్ కామెడీ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది. ఈ చిత్రం ఓటీటీలోనూ అదే విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం.


