|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బోర్డర్-2 ఈవెంట్లో ఊహించని పరిణామం: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ డియోల్!

Updated: 16-12-2025, 11:42 PM
బోర్డర్-2 ఈవెంట్లో ఊహించని పరిణామం: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ డియోల్!
  • ‘బోర్డర్-2’ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దొసాంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
  • బ్లాక్‌బస్టర్ ‘బోర్డర్’ సీక్వెల్‌గా వచ్చే ఏడాది జనవరి 23న ‘బోర్డర్-2’ విడుదల కానుంది.
  • టీజర్ లాంచ్ ఈవెంట్‌లో తండ్రి ధర్మేంద్రను తలచుకుని సన్నీ డియోల్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు.
  • సన్నీ డియోల్ భావోద్వేగపూరిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ‘బోర్డర్-2’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత మొదటిసారి పబ్లిక్‌లో కనిపించిన ఆయన స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అందరినీ కదిలించింది, వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘బోర్డర్-2’ సినిమా విశేషాలు

బాలీవుడ్ స్టార్స్ సన్నీ డియోల్(Sunny Deol), వరుణ్ ధావన్(Varun Dhawan), దిల్జిత్ దొసాంజ్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ ‘బోర్డర్-2’(Border-2). ఇందులో సోనమ్ బజ్వా హీరోయిన్‌గా నటిస్తుండగా..ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘బోర్డర్’‌కు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే తొలిపార్ట్ జెపి దత్తా తెరకెక్కించగా.. సెకండ్ పార్ట్‌ను అనురాగ్ సింగ్ తీశారు. ఈ మూవీ 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ విజయ దివస్ సందర్భంగా ‘బోర్డర్-2’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న స్టార్ హీరో సన్నీ డియోల్ స్టేజ్‌పై ఎమోషనల్ అయ్యారు.

తన తండ్రి, బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత పబ్లిక్‌లో కనిపించిన ఆయన స్టేజ్‌పై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. నవంబర్ 24న, 2025న ధర్మేంద్ర శ్వాసకోశ సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి సన్నీ డియోల్ బయటకు రాకుండా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే.. ‘బోర్డర్-2’ టీజర్ లాంచ్ చేయగా.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ మాట్లాడుతుండగా.. మధ్యలో తన తండ్రిని గుర్తు చేసుకున్న ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆయనకు ధైర్యం చెబుతున్నారు.

స్టేజ్‌పై సన్నీ డియోల్ భావోద్వేగం

తండ్రి ధర్మేంద్రను తలచుకుని కన్నీళ్లు

సన్నీ డియోల్ తన తండ్రిపై ఉన్న ప్రేమను, బాధను బాహటంగా చూపించారు. ఈ సంఘటన అభిమానులను కలిచివేసింది. ఆయన భావోద్వేగ వీడియో సన్నీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.