|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇద్దరు హీరోయిన్లతో సన్నీ లియోన్ భారీ బడ్జెట్ ఐటమ్ సాంగ్.. త్రిముఖ నుంచి ‘గిప్పా గిప్పా’.. 10 మందికిపైగా సెలబ్రిటీలు!

Published: 24-07-2025, 4:24 AM
ఇద్దరు హీరోయిన్లతో సన్నీ లియోన్ భారీ బడ్జెట్ ఐటమ్ సాంగ్.. త్రిముఖ నుంచి 'గిప్పా గిప్పా'.. 10 మందికిపైగా సెలబ్రిటీలు!

అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మితమైన త్రిముఖ సినిమా నుంచి సన్నీ లియోన్ నటించిన ‘గిప్పా గిప్పా’ అనే ఐటెం సాంగ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సాంగ్‌లో సన్నీ లియోన్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా నటించారు.

Key Points

1

త్రిముఖ సినిమాలో భారీ బడ్జెట్ ఐటమ్ సాంగ్ 'గిప్పా గిప్పా' షూటింగ్ పూర్తి.

2

సన్నీ లియోన్, సాహితీ దాసరి, ఆకృతి అగర్వాల్ ప్రధాన పాత్రలు.

4

ఈ నెల చివర్లో 'గిప్పా గిప్పా' సాంగ్ రిలీజ్.

‘గిప్పా గిప్పా’ ఐటమ్ సాంగ్ షూటింగ్ పూర్తి

అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ మోహన్, శ్రీవల్లి సమర్పణ లో యోగేష్ కల్లే నిర్మించిన లేటెస్ట్ మూవీ త్రిముఖ. ఈ సినిమాలో అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ , యోగేష్ కల్లే, ఆకృతి అగర్వాల్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, ఆశు రెడ్డి, చిత్రం శ్రీను, షకలక శంకర్ ముఖ్య తారాగణంగా చేస్తున్నారు.

త్రిముఖ సినిమాకు రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణంలో భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా త్రిముఖ సినిమా నుంచి “గిప్పా గిప్పా” అనే ఐటమ్ సాంగ్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

త్రిముఖ సినిమాలో సన్నీ లియోన్

దీనికి సంబంధించిన విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. యోగేష్ కల్లే, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ పాట సినిమా ప్రపంచంలో ట్రేండింగ్ అవుతుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ ఐటమ్ సాంగ్ గిప్పా గిప్పా తెలుగు ప్రేక్షకులకి సరికొత్తగా అనుభూతిని ఇస్తుందని, కనుల పండుగగా ఉంటుందని చెప్పారు.

ఇక ఈ గిప్పా గిప్పా ఐటమ్ సాంగ్‌లో మరో ఇద్దరు హీరోయిన్ల తో సన్నీ లియోన్ స్టెప్పులేసింది. సన్నీ లియోన్‌తో ఈ సాంగ్‌లో సాహితీ దాసరి (పొలిమేర ఫేమ్), ఆకృతి అగర్వాల్ జోడీ కట్టి ఆడారు. పాటలో ముగ్గురి గ్లామర్ షో యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఉంది.

భారీ స్టార్ కాస్ట్

ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, అద్భుతమైన డాన్స్‌తో ప్రేక్షకులను రంజింప చేస్తారని మేకర్స్ భావిస్తున్నారు. సన్నీ లియోన్‌తో పాటు 10 మందికి పైగా సినీ ప్రముఖులు నృత్యం చేయడంతో ఈ సాంగ్ హైలెట్ అవుతోంది.

అంటే, ముగ్గురు హీరోయిన్లతోపాటు మరికొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ గిప్పా గిప్పా సాంగ్‌లో కనువిందు చేయనున్నారన్నమాట. ఇకపోతే ఈ నెల చివర్లో గిప్పా గిప్పా సాంగ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే, ‘త్రిముఖ’ మూవీ కూడా త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం కానుంది.

త్రిముఖ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘గిప్పా గిప్పా’ ఐటెం సాంగ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.