
📌 Key Points
- సుప్రీత సంచలన ప్రకటన: తప్పుడు వార్తలతో ఆత్మహత్య ఆలోచనలు!
- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సుప్రీత వివరణ: తెలియక చేసిన తప్పిదం!
- రెండవ పెళ్లిపై సుప్రీత క్లారిటీ: అమ్మ కోరిక కాదు, నా నిర్ణయం!
- అమర్‌దీప్‌తో కలిసి సుప్రీత కొత్త చిత్రం: ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’!
టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సంచలన విషయాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!
తప్పుడు వార్తలతో ఆత్మహత్య ఆలోచనలు: సుప్రీత
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత తాజాగా అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అందులో సుప్రీత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. తాజాగా సుప్రీత మాట్లాడుతూ… కొంతమంది మాపై లేనిపోని తప్పుడు కథనాలు రాసి మేము బాధపడుతుంటే మా కన్నీటిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు.
బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీత క్లారిటీ!
మాపై అనేక తప్పుడు వార్తలను రాయడంతో ఆ బాధను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఏ నెగెటివిటీనైనా తట్టుకునే ధైర్యం నాకుంది. గతంలో నేను కొన్ని బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేశాను. కానీ అవి సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమోషన్స్ అని నాకు అప్పుడు అస్సలు తెలియదు. నేను తెలియకుండా తప్పు చేశాను. అది కేవలం తెలియక చేసిన పొరపాటు మాత్రమే, ఇప్పుడు ఏ ప్రమోషన్ చేయాలన్నా మొదట లాయర్ను సంప్రదించి అంతా ఓకేగా ఉంది అనుకుంటేనే దానిని ప్రమోట్ చేస్తున్నాను అని సుప్రీత తెలియజేసింది.
రెండవ పెళ్లిపై కూతురి సంచలన నిర్ణయం!
తన తల్లి సురేఖ వాణి రెండవ పెళ్లి గురించి సుప్రీత స్పందిస్తూ… “మా అమ్మ రెండవ పెళ్లి చేసుకోవాలి అనేది పూర్తిగా నా కోరిక. ఆమెకు ఎప్పుడూ కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన లేదు” అని చెప్పుకొచ్చింది. తాజాగా అమరావతి ఆహ్వానం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సుప్రీత ప్రస్తుతం బిగ్బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా రూపొందుతున్న చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులతో వస్తుందో వేచి చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


