|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య ‘విశ్వనాథన్ అండ్ సన్స్’: టైటిల్ వివాదం! దిగొచ్చిన మేకర్స్.. తెలుగు పోస్టర్ విడుదల!

Published: 02-03-2026, 10:35 AM
సూర్య 'విశ్వనాథన్ అండ్ సన్స్': టైటిల్ వివాదం! దిగొచ్చిన మేకర్స్.. తెలుగు పోస్టర్ విడుదల!
  • సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథన్ & సన్స్’ చిత్రం తెరకెక్కుతోంది.
  • చిత్ర టైటిల్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలకు చిత్ర బృందం తెలుగు టైటిల్‌తో కొత్త పోస్టర్ విడుదల చేసింది.
  • ఈ సినిమాలో సూర్య, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
  • సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు, ఇది జూలైలో విడుదల కానుంది.

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వనాథన్ & సన్స్’ సినిమా టైటిల్ పోస్టర్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర బృందం వెంటనే స్పందించి తెలుగు టైటిల్‌తో కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా జూలైలో విడుదల కానుంది.

విమర్శలకు కారణమైన టైటిల్ పోస్టర్

Vishwanath And Sons: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం విశ్వనాథన్ & సన్స్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం టైటిల్ పోస్టర్ విడుదల చేశారు అయితే ముందు నుంచి ఈ సినిమాకు విశ్వనాథన్ & సన్స్ అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేస్తూ మేకప్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో భాగంగా సూర్య చంటి పిల్లాడిని ఎత్తుకొని కనిపించారు.

ఈ పోస్టర్ చూస్తుంటే తండ్రి కొడుకుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని స్పష్టమవుతుంది అయితే ఈ టైటిల్ పోస్టర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ టైటిల్ పోస్టర్ తెలుగులో లేకపోవడంతో అసలు ఇది తెలుగు సినిమా నేనా అంటూ చాలామంది చిత్ర బృందం పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఇలా తమిళం ఇంగ్లీషులో మాత్రమే టైటిల్ ఉన్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు విమర్శలు కురిపించిన నేపథ్యంలో చిత్ర నిర్మాతలు తాజాగా మరొక పోస్టర్ విడుదల చేశారు.

సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టైటిల్ విషయంలో వచ్చిన విమర్శలపై చిత్ర బృందం వెంటనే స్పందిస్తూ తెలుగు టైటిల్ తో మరొక పోస్టర్ విడుదల చేయడంతో ఈ విమర్శలకు చెక్ పెట్టినట్టు అయింది. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరికెక్కిన ఈ సినిమాని  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా ప్రారంభిస్తున్నారని చెప్పాలి.

వెంటనే స్పందించిన చిత్ర బృందం

A moment. A memory. A lifetime of emotions. ❤️🫶 #VishwanathAndSons in cinemas this JULY. 🤩 @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli @NimishRavi @Banglan16034849 #SaiSoujanya @ynakg2 @SitharaEnts @Fortune4Cinemas … pic.twitter.com/vvQyGf8k95

— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026

జూలైలో విడుదల కానున్న సినిమా

ఇందులో భాగంగానే చిత్ర బృందం టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి వరుసగా కోలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు డైరెక్షన్లో వచ్చిన లక్కీ భాస్కర్, సార్ వంటి సినిమాలు తెలుగు తమిళ భాషలలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విశ్వనాథన్ & సన్స్ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అధికారికంగా తెలియజేయునన్నారు.

సూర్య చిత్రం ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తెలుగు టైటిల్‌తో విడుదల కానుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.