
📌 Key Points
- అహ్మదాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
- భారత జట్టు తమ హోటల్ నుండి స్టేడియానికి బయలుదేరింది, అభిమానులు భారీగా తరలివచ్చారు.
- స్టేడియంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు, 4,500 మంది సిబ్బంది మోహరించారు.
- భారత్ రెండోసారి, న్యూజిలాండ్ తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలవాలని చూస్తున్నాయి.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. నగరం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఫైనల్ పోరుకు సిద్ధమైన అహ్మదాబాద్
యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమ్ ఇండియా, పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో నేడు సాయంత్రం తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ నగరం ఇప్పటికే క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ సాయంత్రం జరగనున్న ఫైనల్ పోరు కోసం భారత జట్టు తమ హోటల్ నుంచి స్టేడియానికి బయలుదేరింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు హోటల్ వెలుపల అభిమానులు భారీగా గుమిగూడారు. “చక్ దే ఇండియా” నినాదాలతో అహ్మదాబాద్ వీధులు మారుమోగుతున్నాయి.
ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లపై జాయింట్ సీపీ నీరజ్ కుమార్ బద్గుజర్ మాట్లాడుతూ.. పోలీసులు, హోమ్ గార్డులతో కలిపి మొత్తం 4,500 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. స్టేడియం లోపల మూడంచెల (3-layer) భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. బాంబు స్క్వాడ్ (BDDS) తో పాటు ప్రత్యేకంగా యాంటీ డ్రోన్ బృందాలను రంగంలోకి దించారు. ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా స్టేడియం లోపలికి వెళ్లడానికి ప్రత్యేక ఛానెళ్లను, పెద్ద హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. కాగా, నేడు గెలిచి రెండోసారి వరుసగా ట్రోఫీని ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉండగా, తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.
భారీ భద్రత నడుమ మ్యాచ్
రెండోసారి భారత్ గెలుస్తుందా?
భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. న్యూజిలాండ్ తొలిసారి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ ఫలితం కోసం యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


