
📌 Key Points
- ‘ఝమ్మంది నాదం’తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్.
- కెరీర్ ప్రారంభంలో దర్శకులు, బ్రాండ్స్ స్ట్రెయిట్ హెయిర్ కోరడం తాప్సీకి నచ్చలేదు.
- రింగుల జుట్టు కారణంగా ఎన్నో సినిమా, బ్రాండ్ అవకాశాలు కోల్పోయానని తాప్సీ వెల్లడి.
- అందమైన జుట్టు అంటే స్ట్రెయిట్ హెయిర్ మాత్రమే అనే ఆలోచన తనను నిరాశపరిచిందని కామెంట్.
స్టార్ హీరోయిన్ తాప్సీ తన సినీ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. దర్శకులు, బ్రాండ్స్ తన రింగుల జుట్టును స్ట్రెయిట్ చేయించుకోమని కోరడం వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయినట్లు తాప్సీ చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాప్సీ సినీ ప్రస్థానం, బాలీవుడ్ ఎంట్రీ
‘ఝమ్మంది నాదం’(Jummandi Nadam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ(Tapsi) మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అలా అప్పట్లో ఓ రేంజ్‌కి ఎదిగిన ఈ చిన్నది ప్రజెంట్ టాలీవుడ్‌లో అంతగా సినిమాలు చేయడం లేదు. మరి దీనికి కావడం అవకాశాలు రాకపోవడమో, మరేదేమైనా కారణమా అనేది తెలియదు. ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మథియాస్ బో(Mathias boe) అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యి.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
అవకాశాలు కోల్పోవడానికి అసలు కారణం ఇదే!
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ తన హెయిర్ వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ తొలినాళ్లలో ప్రతి దర్శకుడు నా జుట్టు స్ట్రెయిట్ చేయించుకోమని అడిగేవారు. చాలాకాలం వరకు దర్శకులు గ్లామర్, స్టైలీష్ లుక్ అంటే కేవలం స్ట్రెయిట్ హెయిర్ మాత్రమే అనే ఆలోచనలో ఉన్నారు. రింగుల జుట్టు అంటే కేవలం రెబల్ రూల్స్ అని భావించారు. అందుకే రింగుల జుట్టు ఉన్న అమ్మాయి పాజిటివ్ పాత్రలకు పనికిరాదని భావించేవారు.
రింగుల జుట్టుపై తాప్సీ అభిప్రాయం, ఆగ్రహం
కెరీర్ మొదట్లో నా హెయిర్ స్ట్రెయిట్ చేయించుకోవడానికి అంగీకరించాను. కానీ తర్వాత సినిమాలే కాకుండా బ్రాండ్ యాడ్స్ సంస్థలు సైతం నా జుట్టు స్ట్రెయిట్ చేయించుకోవాలని చెప్పడం నచ్చలేదు. నాకు యాడ్ చేయడానికి చాలా పెద్ద బ్రాండ్స్ ఆసక్తి చూపించాయి.. కానీ రింగుల జుట్టు కాకుండా స్ట్రెయిట్ హెయిర్ కావాలంటే నేను రిజెక్ట్ చేశాను. అందమైన జుట్టు అంటే రింగుల జుట్టు కాదనే వారి ఆలోచన నన్ను తీవ్రంగా నిరాశ పరిచాయి. చిన్నప్పుడు సైతం నేను నా జుట్టును అసహ్యించుకున్నాను.. కానీ ఆ తర్వాత నా జుట్టుపై కేర్ తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
రింగుల జుట్టుపై సమాజం, పరిశ్రమ అభిప్రాయం తనని ఎంతగానో బాధించిందని తాప్సీ తెలిపింది. సహజ సౌందర్యాన్ని కాదనడం ఎంతమాత్రం సరికాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాప్సీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


