|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటనతోనే కాదు.. ఇతర రంగాల్లోనూ రాణించాలంటున్న తమన్నా! అసలేం జరిగిందంటే?

Published: 25-02-2026, 4:05 AM
నటనతోనే కాదు.. ఇతర రంగాల్లోనూ రాణించాలంటున్న తమన్నా! అసలేం జరిగిందంటే?
  • తమన్నా: నటనతోపాటు ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టడం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
  • సినిమా అవకాశాలు తగ్గితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు అంటున్న తమన్నా.
  • భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమన్నా తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు.
  • శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. హ్యాపీ డేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రముఖ నటి తమన్నా భాటియా నటనపైనే ఆధారపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించడం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటనపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

Tamannaah Bhatia:సినిమా సెలబ్రిటీలకు ఇండస్ట్రీలో లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పడం అసాధ్యం. ఒకవేళ వరుస ఆఫర్లు తలుపు తట్టి తమ టాలెంట్ ను నిరూపించుకోగలిగితే.. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగుతారు. ఒకవేళ అలా జరగలేదు అంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలని చూస్తున్నారు. అలా సినిమాల ద్వారా వచ్చే డబ్బుపై మాత్రమే ఆధారపడకుండా అలా సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఇతర రంగాలలో పెట్టుబడులుగా పెట్టి తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఒకప్పటి సెలబ్రిటీలతో పోల్చుకుంటే ఇప్పటి తారలలో ఆలోచన ధోరణి మారింది.. కాబట్టే ముందస్తు జాగ్రత్తగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉండడం గమనార్హం.

జీవితంలో ఎదగాలంటే మరోదారి తప్పనిసరి..

ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సెలబ్రిటీల దృష్టి

అందులో భాగంగానే స్టార్ హీరోలను మొదలుకొని హీరోయిన్లు కూడా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో జీవితాన్ని సంతోషంగా కొనసాగించాలి అంటే ఆదాయ మార్గాలను చూసుకోవాలని చెబుతున్నారు.. ఇక అందులో భాగంగానే తమన్నా కూడా ఇలా సినిమా నటన జీవితంపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇక సినిమా రంగంలో కొనసాగుతున్నప్పుడే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని తన అభిప్రాయంగా తమన్న చెప్పుకొచ్చింది. తమన్నా మాట్లాడుతూ..” కేవలం నటన పైనే ఆధార పడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా వేరే వ్యాపారాలు లేదా పెట్టుబడులు చూసుకోవడం అవసరం. నేను కూడా నటనతో పాటు వ్యాపార రంగంలో రాణిస్తున్నాను. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది” అంటూ తమన్న చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తమన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈమె చక్కగా తన భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటుంది. అందుకే ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

తమన్నా సినీ ప్రస్థానం గురించి కొన్ని విషయాలు

తమన్నా విషయానికి వస్తే.. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. హ్యాపీడేస్ సినిమాతో తన నటనతో ఆకట్టుకుంది. తన అద్భుతమైన నటనతో మేని ఛాయతో యువత హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత 100% లవ్ సినిమాతో యువత ఫేవరెట్ డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన ఈమె.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ వంటి చిత్రాలతో అభిమానుల గుండెల్లో గుడి కట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు స్పెషల్ సాంగ్ లు చేస్తూనే ఐదు నిమిషాల పాట కోసం ఐదు కోట్లు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న తమన్నా.. మరొకవైపు హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈమె.. దీనికి తోడు పలు రంగాలలో పెట్టుబడులు పెడుతూ దూసుకుపోతోంది.. ఇక అందులో భాగంగానే కర్ణాటక ప్రభుత్వ మైసూర్ శాండిల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలు అయ్యింది.

తమన్నా తన భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవడం ద్వారా స్ఫూర్తినిస్తోంది. సినిమా రంగంతోపాటు ఇతర రంగాలపై దృష్టి సారించాలని సూచిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.