
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా గురించి తెలియని వారుండరు. తాజాగా ఆమె బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. గత 11 ఏళ్లుగా ఆమెకు వస్తున్న కోట్ల రూపాయల ఆఫర్లను ఎందుకు తిరస్కరిస్తోందో తెలుసుకుందాం.
Key Points
తనుశ్రీ దత్తా గత 11 ఏళ్లుగా బిగ్ బాస్ ఆఫర్లను తిరస్కరిస్తోంది.
రూ. 1.65 కోట్ల ఆఫర్‌ను కూడా ఆమె తిరస్కరించింది.
ఒకే మంచం మీద పడుకోవడం, కోట్లాటలు ఆమెకు ఇష్టం లేదు.
తన కుటుంబంతో కలిసి ఉండాలని ఆమె కోరుకుంటోంది.
బిగ్ బాస్ ఆఫర్లను తిరస్కరించిన తనుశ్రీ
బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది . తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది . గత 11 ఏళ్లుగా తనకు బిగ్ బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది . కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది . తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్ కు తేల్చి చెప్పానని పంచుకుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్ బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది . నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా .. నా లైఫ్ లో ఎప్పటికీ బిగ్‌బాస్‌లో పాల్గొనని చెప్పింది .
కోట్ల రూపాయల ఆఫర్‌ను తిరస్కరించడానికి కారణం
తనుశ్రీ దత్తా మాట్లాడుతూ ..’ బిగ్ బాస్ ఆఫర్ ప్రతి ఏటా వస్తోంది . ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు . ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు . ఆమె కూడా నా స్థాయి నటినే . అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్ బాస్ మేకర్స్ లో ఒకరు ఆఫరిచ్చారు . కానీ తిరస్కరించాను . ఎందుకంటే ఈ షోలో పురుషులు , మహిళలు ఓకే బెడ్ పై పడుకుంటారు . అదే ప్లేస్ లో కోట్లాడుకుంటారు . నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా . ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్ కాదు . వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్లను . నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని .. తనకంటూ ప్రత్యేక స్పేస్ కోరుకునేదాన్ని’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది .
తనుశ్రీ దత్తా జీవితం మరియు కెరీర్
బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ ‘ఆషిక్ బనాయా అప్నే’ పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో ‘వీరభద్ర’ అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.
కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా, తన కుటుంబం, వ్యక్తిగత విలువలను ప్రాధాన్యతనిచ్చి బిగ్ బాస్ షోకు దూరంగా ఉండాలని తనుశ్రీ దత్తా నిర్ణయించుకుంది.


