|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాటా సంచలనం: మధ్యతరగతికి రూ.4.69 లక్షలకే అదిరిపోయే కారు!

Published: 28-05-2026, 6:01 AM
టాటా సంచలనం: మధ్యతరగతికి రూ.4.69 లక్షలకే అదిరిపోయే కారు!
  • టాటా 2026 టియాగో, టియాగో EV మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
  • పెట్రోల్ వెర్షన్ టాటా టియాగో ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు.
  • టియాగో EV బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో రూ. 4.69 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
  • కొత్త డిజైన్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 కెమెరా వంటి అధునాతన ఫీచర్లు.

టాటా మోటార్స్ భారత మార్కెట్లోకి సరికొత్త 2026 టియాగో, టియాగో EV కార్లను విడుదల చేసింది. మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని, ఆకర్షణీయమైన ధర, అధునాతన ఫీచర్లతో ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది కారు కొనుగోలుదారులకు శుభవార్త.

కొత్త టియాగో డిజైన్, ఫీచర్లు

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లోకి సరికొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ ‘2026 టాటా టియాగో (Tiago)’, ‘టియాగో EV (Tiago EV) కార్లను అధికారికంగా విడుదల చేసింది. సరికొత్త డిజైన్, సరికొత్త ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లతో ఈ హ్యాచ్ బ్యాక్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. భారత మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకి స్విఫ్ట్, హ్యుండాయ్ గ్రాండ్ 110 నియోస్ వంటి కార్లకు గట్టి పోటీనిచ్చేలా టాటా ఈ కార్లను ముస్తాబు చేసింది.

టాటా టియాగో (పెట్రోల్): ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు. టాటా టియాగో ICNG: ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు.

టియాగో EV: ధరలు, ప్రత్యేకతలు

టాటా టియాగో EV (ఎలక్ట్రిక్): ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు.

( గమనిక : బ్యాటరీ సబ్ స్క్రిప్షన్ మోడల్ (Bass) కింద టియాగో EVని రూ. 4.69 లక్షల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. కాకపోతే కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున బ్యాటరీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది).

ఇంటీరియర్ మార్పులు, టెక్నాలజీ

2026 టాటా టెయాగో డిజైన్ వరంగా భారీ మార్పులకు గురైంది. ముందు భాగంలో ఐబ్రో-స్టైల్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLS)తో కూడిన సరికొత్త LED హెర్ల్యాంప్స్, సెంటర్లో సరికొత్త బ్లాక్ ప్యానెల్, కొత్త బంపర్ను అమర్చారు. కారు పక్క భాగంలో పెద్దగా మార్పులు లేకపోయినా, సరికొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో వర్టికల్ లైన్స్ ఉన్న కోత్త LED టెయిల్ లైట్స్, కొత్త బంపర మరియు వైఫర్ను అందించారు. ఇక టియాగో EV (ఎలక్ట్రిక్) మోడల్ ముందు భాగంలో ఉన్న బ్లాక్ ప్యానెల్ స్థానంలో బాడీ- కలర్ ప్యానెల్, ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్, ఏరోడైనమిక్ డిజైన్ అల్లాయ్ వీల్స్‌ను ఇచ్చారు. ఈ కారు వారణాసి వైబ్రెన్స్, సోహో సర్జ్, పాంగోంగ్ పల్స్, ప్రిస్టిన్ వైట్, ప్యూర్ గ్రే, డేటోనా గ్రే వంటి సరికొత్త రంగుల్లో లభిస్తుంది. EV మోడల్లో వీటికి అదనంగా డెహ్రాడూన్ డ్యూ కలర్ బాటులో ఉంది.

కారు లోపలి భాగం (ఇంటీరియర్) పూర్తిగా మారిపోయింది. బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్ స్కీమ్తో పాటు నిటారుగా ఉండే సరికొత్త డ్యాష్ బోర్డ్ను అందించారు. డ్రైవర్ కోసం కొత్త డిస్ప్లే, సెంటర్లో వెలిగేలా టాటా లోగో (Iluminated Logo) ఉన్న సరికొత్త 2 స్పోక్ స్టీరింగ్ వీలు అమర్చారు. డ్యాష్ బోర్డ్ పై 10.25 ఇంచుల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కొత్త మోడళ్లలో డ్యూయేల్ వైర్లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, బ్లెండ్-స్పాట్ మానిటర్, రియర్ ఏసీ వెంట్స్, క్రూజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెర్ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా ఈ కారుకు 4 స్టార్ గ్లోబల్ NCAP (GNCAP) సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు మెరుగైన చాసిస్ (Chassis) అమర్చారు. EV మోడల్లో అదనంగా ఆటో డీమిస్ట్, హై-బీమ్ అలర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ టాటా టియాగో మోడళ్లు మార్కెట్లో గట్టి పోటీనివ్వనున్నాయి. తక్కువ ధరలో మంచి కారు కోసం చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.