|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టీసీఎస్‌లో దిగ్భ్రాంతికర ఘటన: లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు!

Published: 12-04-2026, 7:05 AM
టీసీఎస్‌లో దిగ్భ్రాంతికర ఘటన: లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు!
  • TCS నాసిక్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు.
  • బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది ఎఫ్ఐఆర్‍లు నమోదు చేసిన పోలీసులు.
  • లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలపై టీమ్ లీడర్లతో సహా ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.
  • వేధింపులకు తావులేదని, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ టీసీఎస్ ప్రకటన విడుదల.

ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. పలువురు ఉద్యోగులను తొలగించడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టీసీఎస్ నాసిక్ కార్యాలయంలో వివాదం

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ (Nashik) కార్యాలయం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మార్చిలో ముంబయి నాకా ప్రాంతంలోని ఓ బీపీఓ కార్యాలయంలో పని చేస్తున్న ఓ యువతి డియోలాలి క్యాంప్ పోలీసులను ఆశ్రయించింది. 2022-2026 మధ్య ఒక మహిళతో సహా ముగ్గురు సహోద్యోగులు తన మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించింది. ఓ పురుష సహోద్యోగి తనపై పలుమార్లు లైంగికంగా వేధించాడని తన ఫిర్యాదులో పేర్కోంది.

పోలీసుల విచారణలో వెలుగుచూసిన నిజాలు

రంగంలోకి దిగిన నాసిక్ పోలీసులు ఏప్రిల్ 3 నాటికి మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్‍లు నమోదు చేశారు. పోలీసుల విచారణ లోతుగా సాగేకొద్దీ మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నమోదైన ఎఫ్ఐఆర్‍లలో 8 మంది మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లపై ఫిర్యాదు చేయగా, ఒక పురుష ఉద్యోగి కూడా మతపరమైన వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ‘ప్రత్యేక విచారణ బృందం’ (SIT)ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో టీమ్ లీడర్లు, ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు, ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలతో కంపెనీ మహిళా హెచ్‌ఆర్ (HR) మేనేజర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీసీఎస్ స్పందన

ఈ ఘటనపై ఆదివారం టీసీఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మా సంస్థలో వేధింపులకు తావులేదు. ఉద్యోగుల భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. నాసిక్ ఘటన మా దృష్టికి రాగానే తక్షణమే స్పందించామని విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసినట్లు తెలిపింది. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన సంస్థలో ఇలా లైంగిక వేధింపులతో పాటు మతమార్పిడి వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.

టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. పోలీసులు పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.