|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! జూన్ 2న డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభం: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

Published: 16-05-2026, 5:45 AM
తెలంగాణ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! జూన్ 2న డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభం: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
  • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూన్ 2న డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభం.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
  • కొత్త పీఆర్సీ నివేదిక, పెండింగ్ బిల్లులు, 317 జీవో బదిలీలపై చర్చించారు.
  • సీఎస్ కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సానుకూల స్పందన.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2న డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభం కానున్నాయి. పీఆర్సీ, పెండింగ్ బిల్లులపై కూడా చర్చలు జరిగాయి.

ఉద్యోగుల సమస్యలపై కీలక సమావేశం

Telangana Govt Employees : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కీలక సమావేశం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సుదీర్ఘంగా ప్రస్తావించారు. ప్రధానంగా కొత్త పీఆర్సీ (PRC) నివేదిక, ఉద్యోగుల ఉచిత వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు, దీర్ఘకాలంగా నిలిచిపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ నిబంధనల అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాకుండా సాధారణ బదిలీలతో పాటు తీవ్ర వివాదాస్పదమైన 317 జీవో బదిలీల బాధితుల సమస్యలపై ఈ కౌన్సిల్ భేటీలో విస్తృతంగా చర్చించారు.

జూన్ 2న డిజిటల్ హెల్త్ కార్డుల ప్రారంభం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు… రాబోయే జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులను లాంఛనంగా ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

దీనితో పాటు సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన ఆర్థికేతర సమస్యలను వీలైనంత త్వరగా, సానుకూలంగా పరిష్కరించాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికకు సంబంధించి వీలైనంత నివేదికను తెప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. ఆ దిశగా పీఆర్సీ కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పీఆర్సీ, పెండింగ్ బిల్లులపై చర్చలు

సచివాలయ స్థాయిలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా… ఆధునిక టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకుంటూ ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఉద్యోగులు, సంఘాల నాయకులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తం మీద, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఈ సమావేశం స్పష్టం చేసింది. డిజిటల్ హెల్త్ కార్డుల ప్రారంభం ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని సానుకూల నిర్ణయాలు ఆశించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.