|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. తండ్రికూతుళ్ల అనుబంధంతో హత్తుకునేలా.. ఎక్కడంటే?

Published: 20-07-2025, 5:18 AM
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. తండ్రికూతుళ్ల అనుబంధంతో హత్తుకునేలా.. ఎక్కడంటే?

ఇవాళ ఓటీటీలో విడుదలైన ‘నగుమోము కనలేని’ అనే తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం, తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తుంది. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించారు.

Key Points

1

తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'నగుమోము కనలేని' ఓటీటీలో రిలీజ్.

2

తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూపించే కథాంశం.

4

సినియర్ నటుడు తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రలో నటించారు.

‘నగుమోము కనలేని’ ఓటీటీ ప్రయాణం

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతివారం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఈ వారం కూడా సుమారుగా 30కిపైగా ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఎక్కువగా శుక్రవారం (జూలై 18) ఎక్కువగా 20 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఇక ఇవాళ (జూలై 20) ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఆ సినిమానే నగుమోము కనలేని. ఈ మూవీలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తండ్రి పాత్రలో నటించాడు. ఆయనతోపాటు శరణ్య శర్మ, ఇందుమతి, రాజా చెంబోలు, ఫణి ప్రకాష్, నెహల్, జయ పరమేశ్వరన్, సుస్మిత, శ్రీనివాస్, రాజు, కిశోర్, సందీప్ ఇతర పాత్రలు పోషించారు.

నగుమోము కనలేని సినిమాను తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, భావోద్వేగాలతో ఎమోషనల్‌గా మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు డైరెక్టర్ అనురాధ. లేడి దర్శకురాలు తెరకెక్కించిన నగుమోము కనలేని ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది.

తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం

ఈటీవీ విన్‌లో నగముమోము కనలేని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు భాషలో ఇవాళ నగుమోము కనలేని ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, గత కొంతకాలంగా ఈటీవీ విన్‌లో కథా సుధా అనే మినీ ఓటీటీ సిరీస్‌తో అతి తక్కువ నిడివి గల తెలుగు సినిమాలను డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ కథా సుధా మినీ సిరీస్‌లో భాగంగా నగుమోము కనలేని ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. కేవలం 36 నిమిషాల 9 సెకన్ల రన్ టైమ్‌తో నగుమోము కనలేని సినిమాను రూపొందించారు. రీసెంట్‌గానే నగుమోము కనలేని ట్రైలర్‌ను ఈటీవీ విన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రిలీజ్ చేసింది.

చిత్ర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

ఇక నగుమోము కనలేని కథ విషయానికొస్తే.. తండ్రీ, తల్లి, కూతురు ముగ్గురు కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. తల్లి కంటే ఎక్కువగా తండ్రిని కూతురు ప్రేమిస్తుంది. అలాగే, తండ్రి కూడా కూతురుని బాగా గారాబం చేస్తూ పెంచుతాడు. తండ్రీకూతుళ్లు ఇద్దరు స్నేహితుల్లా సందడి చేస్తుంటారు.

ఇలా ఆనందంగా సాగుతున్న వారి జీవితంలోకి ఓ ఊహించని వ్యక్తి వస్తాడు. తల్లిదండ్రుల మాట ఎప్పుడు కూడా వినని ఆ కుమార్తె అతని మాట విని ఒకేచోట ఉండిపోతుంది. ఆ తర్వాత ఏమైంది?, ఎవరా వ్యక్తి? తండ్రికి దూరంగా కూతురు ఎందుకు ఉండాల్సి వచ్చింది? వంటి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే సినిమానే నగుమోము కనలేని మూవీ కథ.

సుమారు 36 నిమిషాల నిడివితో, ‘నగుమోము కనలేని’ చిత్రం తెలుగు ప్రేక్షకులను తన కథాంశంతో ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. ఈటీవీ విన్ లో వీక్షించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.