|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల సునామీ! చివరి గడువు ఎప్పుడో తెలుసా?

Published: 05-04-2026, 2:05 AM
టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల సునామీ! చివరి గడువు ఎప్పుడో తెలుసా?
  • ఏప్రిల్ 4 వరకు 2.90 లక్షలకు పైగా టీజీ ఈఏపీసెట్ దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.
  • ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2 లక్షలకు పైగా, బైపీసీ స్ట్రీమ్‌కు 87 వేల దరఖాస్తులు వచ్చాయి.
  • లేట్ ఫీజుతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
  • గతేడాది మూడు లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి కూడా ఆ సంఖ్యను దాటే అవకాశం ఉంది.

తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 4 వరకు 2.90 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. లేట్ ఫీజుతో మే 2 వరకు అవకాశం ఉంది.

టీజీ ఈఏపీసెట్‌కు పోటెత్తిన దరఖాస్తులు

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముసిగింది. ఈ తేదీలోపు భారీగానే దరఖాస్తులు వచ్చాయి.

శనివారం నాటికి 2.90 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందులోనూ అత్యధికంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష కోసం 2 లక్షలకుపైగా దరఖాస్తులు దాటాయి. బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు 87 వేల వరకు వచ్చాయి. ఇంజినీరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్, ఫార్మసీ కోసం (రెండు కలిపి) దాదాపు 300 మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. అమ్మాయిల నుంచి అధిక సంఖ్యలో అందాయి.

స్ట్రీమ్ వారీగా అందిన దరఖాస్తుల వివరాలు

గతేడాది టీజీ ఈఏపీసెట్ కు మూడు లక్షల దరఖాస్తులు అందాయి. అయితే ఆలస్య రుసుంతో కూడా చాలా మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే… ఈసారి కూడా దరఖాస్తుల సంఖ్య 3 లక్షలు దాటొచ్చని అంచనా.

ఇంజినీరింగ్ స్ట్రీమ్ అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు కలిపి దరఖాస్తు చేసుకునేంటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000, ఇతరులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ ఫీజులున్నాయి.ఈ తేదీ పూర్తి కావటంతో…. ఈ ఫీజుతో పాటు ఆలస్య రుసుంను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

చివరి తేదీ మరియు అప్లికేషన్ ఫీజు వివరాలు

టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే…. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తానికి, టీజీ ఈఏపీసెట్ 2026కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. తుది గడువు సమీపిస్తుండటంతో, విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.