|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘జన నాయగన్’ తర్వాత కూడా విజయ్ సినిమాలు చేస్తారా? అసలు నిజం ఇదిగో!

Published: 12-01-2026, 3:00 AM
షాకింగ్: 'జన నాయగన్' తర్వాత కూడా విజయ్ సినిమాలు చేస్తారా? అసలు నిజం ఇదిగో!
  • విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఆయన చివరి సినిమా కాకపోవచ్చునని ట్రేడ్ వర్గాల సమాచారం.
  • రాజకీయాల్లోకి వెళ్లినా విజయ్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.
  • అట్లీ, ఏఆర్ మురుగదాస్ వంటి దర్శకులతో విజయ్ మెగా ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయట.
  • విజయ్ MLAగా గెలిస్తే పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటారు, లేకుంటే హీరోగా కొనసాగే అవకాశం ఉంది.

విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు ‘జన నాయగన్’ ఆయన చివరి సినిమా అని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా సినిమాల్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘జన నాయగన్’ తర్వాత విజయ్ ఏం చేస్తారు?

Vijay Last Movie: ఇప్పటి వరకు అందరూ నమ్మింది ఒకటే. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసే చివరి సినిమా ‘జన నాయగన్’ అని. కానీ తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే ఈ మాట నిజం కాదు అని అనిపిస్తోంది. తాజాగా ట్రేడ్ వర్గాలు బయట పెట్టిన వార్తలు ఫ్యాన్స్‌ని ఆలోచనలో పడేశాయి. జన నాయగన్ విజయ్‌కు పూర్తిగా చివరి సినిమా కాకపోవచ్చు’ అని టాక్ వినిపిస్తోంది. ఇది వినగానే విజయ్ అభిమానులకు ఆశలు మళ్లీ మొదలయ్యాయి.

అసలు జన నాయగన్ సినిమా విషయానికి వస్తే, హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. రూ.400–500 కోట్ల భారీ బడ్జెట్‌తో KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు లాంటి బలమైన క్యాస్ట్ ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న సినిమా ఇది. ఇక జన నాయగన్ తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతాడని అన్నారు.

తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పకపోవచ్చు. రాజకీయాలు సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేసే అవకాశాలు ఉంటాయట. విజయ్ ఈ సారి తమిళ నాడు ఎన్నికలలో MLA గా గెలవకపోతే మళ్లీ మెయిన్ హీరోగా పెద్ద సినిమాలు చేసే ఛాన్స్ ఉందట. అట్లీ, ఏఆర్ మురుగదాస్ లాంటి డైరెక్టర్లతో మెగా ప్రాజెక్టులు కూడా లైన్ లో పెట్టే అవకాశం ఉందట.

రాజకీయాల్లో విజయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

ఒకవేళ విజయ్ MLA గా గెలిస్తే మాత్రం ఫుల్‌టైమ్ రాజకీయాలు చూడడంలోనే బిజీగా ఉంటారు విజయ్. కానీ అప్పుడు కూడా సినిమాల్లో క్యామియో రోల్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తారట. శివ కార్తికేయన్, ధృవ్ విక్రమ్, సూర్య, విజయ్ సేతుపతి, జేసన్ సంజయ్ లాంటి హీరోల సినిమాల్లో విజయ్ స్పెషల్ అపియరెన్సులు చేయడానికి రెడీగానే ఉన్నారట. అంటే ఎలా చూసినా కూడా జన నాయగన్ విజయ్ ఆఖరి సినిమా కాదు.

అయితే MLA గా గెలిస్తే జన నాయగన్ విజయ్ లీడ్ హీరోగా చేసే చివరి పూర్తి స్థాయి సినిమా కావచ్చు. కానీ సినిమాల్లో విజయ్ కనిపించేది ఇదే చివరిసారి కాదు అన్నది తాజా టాక్. విజయ్‌కు సినిమాలు అంటే ఉన్న ప్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా గట్టిగా ఉంది. అందుకే రెండింటికీ మధ్య బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సినిమాల్లో విజయ్ ప్రత్యేక పాత్రలు?

ఏ రకంగా చూసినా జన నాయగన్ విజయ్ కెరీర్ లో ఒక మైలురాయి. కానీ పూర్తిగా ఫుల్ స్టాప్ కాదు. రాజకీయాల మధ్య కూడా విజయ్ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. ఇక విజయ్ క్యామియో ఎప్పుడు? ఎవరితో? అనే వాటికి సమాధానం సమయం మాత్రమే చెబుతుంది.

మొత్తానికి జన నాయగన్ సినిమా విజయ్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుంది. రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన సినిమాలకు పూర్తిగా దూరం కాకపోవచ్చు అనేది తాజా సమాచారం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.