|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్-సంగీతల విడాకులు: అసలు కారణాలివేనా? సంచలన ఆరోపణలు!

Published: 28-02-2026, 1:05 AM
విజయ్-సంగీతల విడాకులు: అసలు కారణాలివేనా? సంచలన ఆరోపణలు!
  • విజయ్, సంగీత 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
  • సంగీత విడాకుల పిటిషన్‌లో విజయ్‌పై ఏడు అభియోగాలు మోపారు.
  • విజయ్ వేరే నటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని సంగీత ఆరోపించారు.
  • డబ్బు విషయంలో ఆంక్షలు, వేధింపులు ఉన్నాయని సంగీత పేర్కొన్నారు.

కోలీవుడ్ స్టార్ విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. సంగీత, విజయ్‌పై ఏకంగా ఏడు అభియోగాలు మోపడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విడాకులకు కారణమైన అభియోగాలు

Vijay – Sangeetha: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా , దళపతిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు విజయ్ (Vijay ). ఒకవైపు సినిమాలలో రాణిస్తూనే మరొకవైపు టీవీకే పార్టీ స్థాపించి రాజకీయాలలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన భార్య సంగీత (Sangeetha ) విజయ్ కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటీషన్ లో తెలుపుతూ విడాకులు కోరడం సంచలనంగా మారింది. 1999 ఆగస్టు 25న పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు.. ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. అయితే సినీ నటితో వివాహేతర సంబంధం కారణంగానే విడాకుల కోరినట్లు సంగీత తన పిటీషన్ లో పేర్కొంది. చంగల్పట్టు కోర్టులో డైవర్స్ పిటిషన్ దాఖలు చేయగా ..ఏప్రిల్ 20వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు విజయ్ కి సమన్లు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మాత్రం విజయ్ ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే విజయ్ తో విడాకులు కోరుతూ విజయ్ పై సంగీత ఏకంగా ఏడు కీలక అభియోగాలను మోపింది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

26 సంవత్సరాలుగా వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్న తమ జీవితంలోకి ఒక నటి వచ్చిందని.. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం వల్లే విజయ్ తో జీవితం కొనసాగించడానికి తాను సిద్ధంగా లేను అంటూ తన అభిప్రాయాలను తెలియజేసిందట.

2. నిర్లక్ష్యం & పశ్చాత్తాపం లేదు:

సంగీత ఆరోపణల సారాంశం

భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. చేసిన తప్పుకు పశ్చాతాపం పొందకపోవడం వల్లే తాను విసిగిపోయానని ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నారట.

ప్రేమించి, పెళ్లి చేసుకున్న తన భర్త.. తన ప్రేమను తనపై చూపించకుండా వేరొక నటిపై చూపిస్తుండడంతో తట్టుకోలేక తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్లు ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నట్లు సమాచారం.

4. ఆర్థిక ఆంక్షలు: డబ్బు విషయంలో కూడా తనపై ఆంక్షలు విధిస్తున్నట్లు 7 కీలక అభియోగాలలో ఒకటిగా ఆమె పేర్కొంది.

తన కదలికలపై నియంత్రణ చూపిస్తాడని, తన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడు అంటూ సంగీత పేర్కొన్నట్లు తెలుస్తోంది.

విజయ్ స్పందన కోసం ఎదురుచూపులు

మాటలతో నిరంతరం వేధిస్తున్నాడని.. అనవసరమైన మాటలు మాట్లాడి తనను వేదనకు గురి చేస్తున్నాడు అంటూ తెలిపినట్లు సమాచారం.

7. రెండేళ్లుగా వేరుగా నివాసం:

ఇకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ తన భర్త తనతో ఒకే ఇంట్లో ఉండకుండా గత రెండు సంవత్సరాలుగా వేరే నివాసంలో ఉంటున్నారంటూ ఆమె తన అభియోగాలను వివరించిందట. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మరి ఏప్రిల్ 20 2026న జరగబోయే విచారణలో అసలు ఏం తేలనింది అనే విషయం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

మొత్తానికి విజయ్, సంగీతల విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అభిమానులు మాత్రం ఇది రాజకీయ కుట్ర అని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.