|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినీ ఇండస్ట్రీలో పెను దుమారం! పెద్ద దిక్కు లేరన్న తమ్మారెడ్డి! చిరంజీవి ప్రస్తావన!!

Published: 11-03-2026, 8:05 AM
సినీ ఇండస్ట్రీలో పెను దుమారం! పెద్ద దిక్కు లేరన్న తమ్మారెడ్డి! చిరంజీవి ప్రస్తావన!!
  • తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతగా ‘వదలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
  • సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరని తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
  • గతంలో చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా వ్యవహరించారని కొందరు గుర్తు చేస్తున్నారు.
  • దాసరి నారాయణరావు సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించేవారని పలువురు పేర్కొన్నారు.

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా సినీ పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరూ లేరని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

తమ్మారెడ్డి భరద్వాజ్ తాజా వ్యాఖ్యలు

Thammareddy Bhardwaj: తమ్మారెడ్డి భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న తమ్మారెడ్డి ఇటీవల కాలంలో సినిమాలనేవి నిర్మించడం లేదు అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా తరచూ ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతూ వివాదాలలో నిలుస్తుంటారు అయితే చాలా రోజుల తర్వాత తమ్మారెడ్డి నిర్మాతగా ‘వదలా’ (Vadalaa)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. జగపతిబాబు, లయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో అంశాల గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ (Thammareddy Bhardwaj) మాట్లాడారు అయితే సినిమా ఇండస్ట్రీ పెద్ద గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎవరు పెద్ద లేరని, ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది అంటూ  చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో వాళ్లు చేసే పనులను బట్టి ఇండస్ట్రీకి పెద్ద అవుతారని తెలిపారు. ఒకప్పుడు ఒకాయన పెద్ద దిక్కుగా ఉండేవారు ఇప్పుడు ఆయన లేరని తమ్మారెడ్డి తెలిపారు.

ఇండస్ట్రీ పెద్ద దిక్కుపై భిన్నాభిప్రాయాలు

ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్లేవారు ఆ సమస్యను పరిష్కరించేవారు అందుకే పెద్దదిక్కుగా మారిపోయారు .ఆయన తర్వాత ఇండస్ట్రీలో ఎవరు పెద్దదిక్కు లేరు.. ఇంకొకడు రాడు..లేరు కూడా అంటూ మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు గతంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కు చిరంజీవి (Chiranjeevi) అంటూ మాట్లాడిన వీడియోలను వైరల్ చేస్తూ తమ్మారెడ్డి పై విమర్శలు కురిపిస్తున్నారు. దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ పెద్దగా అప్పట్లో సినిమా సెలబ్రిటీలు కార్మికుల సమస్యలను కూడా ఈయన బాధ్యతగా తీసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించేవారు.

చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద కాదా?

చిరంజీవి గత పాత్రపై చర్చ

దాసరి నారాయణరావు గారి మరణం అనంతరం ఆ బాధ్యతలను ఎవరు చేపట్లేదు కానీ ఇటీవల కాలంలో చిరంజీవి మాత్రం ఇండస్ట్రీలో కార్మికులకు ఏదైనా సమస్య వస్తే తానున్నానంటూ ముందుకు వస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఇండస్ట్రీకి చిరంజీవి పెద్దదిక్కు అంటూ భావిస్తున్న తరుణంలో తమ్మారెడ్డి ఎవరూ లేరు.. ఎవరూ రారు అంటూ చేసిన వ్యాఖ్యలు పట్ల బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల సినిమా సెలబ్రిటీల నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి. రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.