|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`థగ్‌ లైఫ్‌` ట్రైలర్‌.. కమల్‌ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు, పూనకాలు పక్కా

Published: 17-05-2025, 8:18 PM
`థగ్‌ లైఫ్‌` ట్రైలర్‌.. కమల్‌ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు, పూనకాలు పక్కా

కమల్ హాసన్ మరియు మణిరత్నం కలయికలో తెరకెక్కిన `థగ్ లైఫ్` సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కమల్ హాసన్ ను ఒక కొత్త కోణంలో చూపిస్తూ, సినిమాపై ఆసక్తిని పెంచింది. యాక్షన్ సన్నివేశాలు, కథాంశం ఆకట్టుకునేలా ఉన్నాయి.

Key Points

1

కమల్ హాసన్ అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు.

2

శింబు, త్రిష తమ నటనతో అలరించారు.

4

కమల్, శింబుల మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం.

కమల్ హాసన్ యొక్క అద్భుతమైన లుక్

కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేసిన భారీ సినిమా `థగ్‌ లైఫ్‌`. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు (మే 17, 2025) సాయంత్రం 5 గంటలకు విడుదలైంది. ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో `థగ్‌ లైఫ్‌` ట్రైలర్ వైరల్ అవుతోంది.

కమల్ హాసన్ ఇంతకు ముందు చూడని లుక్ లో అదరగొడుతున్నారు. ఆయనకు ధీటుగా శింబు కూడా తన నటనతో ఆకట్టుకుంటున్నారు. త్రిష, ఇతర నటులు కూడా కీలక పాత్రల్లో అద్భుతంగా నటించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం ట్రైలర్ కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచుతున్నాయి.

యాక్షన్ సీన్స్ చాలా గ్రాండ్ గా, రక్తి కట్టించేలా ఉన్నాయి. ట్రైలర్ ని పరిశీలిస్తే ఇందులో కమల్‌ హాసన్‌ తనని కాపాడిన బాలుడిని(చిన్నప్పుడు శింబు) చేరదీని పెంచుతాడు. చివరి వరకు నువ్వూ నేను ఒక్కటే అని చెబుతాడు.  తన కొడుకులా పెంచడంతోపాటు తనకు సంబంధించిన అన్ని అధికారాలను అమర్‌(శింబు)కి అప్పగిస్తాడు. కమల్‌ ఒక మాఫియా నాయకుడు `రంగనాయక్‌ శక్తిరాజ్‌)గా కనిపిస్తారు. ఆయనకు సంబంధించిన మాఫియా డీల్స్ అన్ని బయట అమర్‌ చూసుకుంటాడు. లోపల తాను చూసుకుంటానని ప్రకటిస్తారు.

యాక్షన్, ఎమోషన్స్ కలగలసిపోయిన ట్రైలర్

ఈ క్రమంలో అనేక యాక్షన్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. మనుగడ కోసం పోరాటం సాగిస్తున్న క్రమంలో శింబు ఓ దశలో తన ప్రభావం పెంచుకుని తానే నాయకుడిగా ప్రకటించుకుంటాడు. `ఇకపై ఇక్కడ నేనే రంగనాయక్‌ శక్తిరాజ్‌ `అని తన మాఫియా నాయకులకు ప్రకటిస్తాడు. దీంతో తనకు శింబు వెన్నుపోటు పొడవడాన్ని తట్టుకోలేని కమల్‌ అతని అంతు చూడాలని భావిస్తారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర పోరాటం జరుగుతుంది. చివరగా `యముడికి నాకు జరిగే కథ. నువ్వా నేనా` అంటూ కమల్‌, శింబు పోట్లాడుకోవడం అదిరిపోయింది.

`థగ్‌ లైఫ్‌` ట్రైలర్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఆద్యంతం యాక్షన్‌ సీన్లు మతిపోయేలా ఉన్నాయి. కమల్‌ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అదే సమయంలో కమల్‌, శింబు ల మధ్య బాండింగ్‌ కూడా ఎమోషనల్‌గా ఉంది. ఇందులో కమల్‌ అటు అభిరామితోపాటు త్రిషతోనూ రొమాన్స్ చేయడం షాకిస్తుంది. మణిరత్నంలో సర్‌ప్రైజ్‌ చేయబోతున్నాడని అనిపిస్తుంది. అదే సమయంలో కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన `నాయకుడు`కి సీక్వెల్‌ని పోలినట్టుగా ట్రైలర్‌ ఉండటం విశేషం.

`నాయకుడు` సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం మళ్ళీ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. `థగ్‌ లైఫ్‌` కారణం.. చంపడానికి కారణం” అనే ట్యాగ్ లైన్ సినిమా కథ హింసాత్మకంగా ఉంటుందని సూచిస్తోంది.

కమల్, శింబుల మధ్య ఉత్కంఠ

ఈ సినిమాలో శింబు, త్రిషతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు. ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన సంగీతంతో పాటు గ్రాండ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. `థగ్‌ లైఫ్‌`” సినిమా జూన్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా యాక్షన్ ఫీస్ట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మొత్తానికి, `థగ్ లైఫ్` ట్రైలర్ అంచనాలను మించిపోయింది. కమల్ హాసన్ మరియు శింబుల నటన, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమా విజయానికి కారణం అవుతాయని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.