
‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు ముందు కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఆయన కోర్టును ఆశ్రయించడంతో పాటు, తాజాగా ఓ ట్వీట్ చేయడం నెటిజన్లలో చర్చకు దారితీసింది.
Key Points
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ఆడియో లాంచ్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించినప్పటికీ, కమల్ హాసన్ క్షమాపణలు చెప్పలేదు.
కోర్టులో పిటిషన్ వేసి, తన సినిమా విడుదలకు రక్షణ కోరారు.
కమల్ హాసన్ తాజా ట్వీట్ కలంజ్ఞర్ పుట్టినరోజు వేడుకలపై నెటిజన్లలో చర్చకు దారితీసింది.
‘థగ్ లైఫ్’ వివాదం: కమల్ హాసన్ వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife). మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi) హీరోయిన్లుగా నటిస్తుండగా.. శింబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలోనే కమల్ హాసన్ ఆడియో లాంచ్‌లో కన్నడ భాషపై చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ‘థగ్‌లైఫ్’ విడుదలను అడ్డుకుంటామని చెప్పినప్పటికీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోవడం గమనార్హం. ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. తన సినిమా విడుదల అయ్యేలా చూడాలని.. తనకు రక్షణ కల్పించాలని కోరాడు.
అలాగే ఓ లేఖను కూడా రిలీజ్ చేశారు. కన్నడలో నా సినిమాలు రిలీజ్ చేయకుండా అయినా ఉంటాను కానీ క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదంటూ లేఖను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, కమల్ హాసన్ తమిళ భాషలో ఓ ట్వీట్ పెట్టారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కలంజ్ఞర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నా. ఆయన తన జీవితం మొత్తం తమిళ భాష, తమిళ కళ, తమిళ రాష్ట్రం అభివృద్ధికి అంకితం చేశారు. తమిళ కళ సంక్షేమానికి అనితర కృషి చేశారు. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కోర్టు పిటిషన్ మరియు క్షమాపణలు
కమల్ హాసన్ ట్వీట్ మరియు నెటిజన్ల స్పందన
కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు, కోర్టుకు వెళ్ళడం, మరియు తాజా ట్వీట్ వల్ల ‘థగ్ లైఫ్’ విడుదల చుట్టూ ఎన్నో ప్రతిస్పందనలు వస్తున్నాయి. వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.


