
📌 Key Points
- అమెరికాలోని వార్ మెమోరియల్ వద్ద కొరియోగ్రాఫర్ మధు రాజు డ్యాన్స్ వీడియో వివాదం.
- అమెరికన్ల ఆగ్రహం, ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్లు.
- మధు రాజు ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌పై ప్రభావం చూపే అవకాశం.
- సోషల్ మీడియాలో వీడియో వైరల్, రాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికాలో ఒక కొరియోగ్రాఫర్ చేసిన పని ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. వార్ మెమోరియల్ వద్ద డ్యాన్స్ చేస్తూ వీడియో తీయడంతో అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వార్ మెమోరియల్ వద్ద డ్యాన్స్: అమెరికన్ల ఆగ్రహం
చాలా మంది ఇండియన్స్‌కు ఇప్పుడు రీల్స్ పిచ్చి పట్టుకుంది. ఎక్కడకు వెళ్లినా అదే పనిలో ఉంటున్నారు. పక్కన ఉన్నది ఏంటి, వీడియోలు చేయెుచ్చా? లేదా అనేది కూడా ఆలోచించడం లేదు. వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టేయడం.. తర్వాత కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం. కొందరైతే ప్రాణాల మీదకు తెచ్చుకునేలా కూడా రీల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా అమెరికాలో ఓ మహిళతో కలిసి ఒక కొరియోగ్రాఫర్ టిక్‌టాక్ వీడియో తీశాడు. వీడియో తీసిన ప్రదేశంపై అమెరికన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
తెలుగు పాటలతో గుర్తింపు పొందిన టిక్‌టాకర్, కొరియోగ్రాఫర్ మధు రాజు ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోతో అమెరికాలో ఉంచుతారా? పంపించేస్తారా? అనేదాకా వచ్చింది. వివాదాస్పద డ్యాన్స్ వీడియో తర్వాత బహిష్కరణ భయాలు పెరగడంతో అతడి కెరీర్ మీద ప్రభావం పడేలా ఉంది. వాషింగ్టన్ డి.సి.లోని రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఒక మహిళాతో కలిసి మధు రాజు అనే కొరియోగ్రాఫర్ టిక్ టాక్ డ్యాన్స్ వీడియో తీశాడు.
దాదాపు 400,000 మంది అమరవీరులైన అమెరికన్లను గౌరవించే ఒక పవిత్ర స్థలం ఇది. ఈ వార్ మెమోరియల్ ముందే మధు రాజు, ఒక మహిళ డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. దీనిని టిక్ టాక్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయింది. ఈ వార్ మెమోరియల్‌ను అమెరికన్లు చాలా గౌరవంగా చూస్తారు. ఇలాంటి స్థలంలో డ్యాన్స్ లు చేయడంతో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు యూఎస్ అధికారులు ఈ విషయంపై దృష్టిసారించారు.
ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్
టెక్సాస్‌లోని డల్లాస్‌లోని MAD డాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు మధు రాజు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో క్లౌడ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని కంపెనీని ట్యాగ్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు అమెరికన్లు. అతని స్థానంలో ఒక అమెరికన్ ఉద్యోగిని నియమించాలని కూడా పిలుపునిచ్చారు.
డ్యాన్స్ చేసిన తర్వాత టిక్‌టాక్‌లో వీడియోను మధు రాజు పోస్ట్ చేశాడు. ఆ తర్వాత విమర్శలు వచ్చాయి. తన అకౌంట్ నుండి ఫుటేజ్‌ను తొలగించడానికి ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే చాలా మంది దానిని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చాలా మందికి ఇది రీచ్ అయింది. అయితే ప్రస్తుతం రాజు సోషల్ మీడియాలో కనిపించడం లేదు.
రాజు ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌పై ప్రభావం?
ఈ కాంట్రవర్సీ కాస్త రాజు ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌పై పడేలా ఉంది. గౌరవప్రదమైన వార్ మెమోరియల్ వద్ద మధు రాజు డాన్స్ వీడియోతో అధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. రాజు వీసా రద్దుకు దారితీసే అవకాశం కూడా ఉందంటున్నారు. అధికారులు ఇప్పుడు అతని కేసును పరిశీలిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
రాజుతో కలిసి నృత్యం చేసిన మహిళ గురించి తెలియాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం స్మారక చిహ్నం వైరల్ వీడియోలకు స్థలం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మధు రాజుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. రాజు తను చేసిన డ్యాన్స్ వీడియోపై క్షమాపణలు చెప్పాడు, కానీ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇమ్మిగ్రేషన్ సమీక్ష కొనసాగుతున్నందున యునైటెడ్ స్టేట్స్‌లో అతని భవిష్యత్తు ఏంటో ఇక తెలియాల్సి ఉంది.
వార్ మెమోరియల్ వద్ద డ్యాన్స్ చేయడం ద్వారా మధు రాజు అమెరికన్ల మనోభావాలను దెబ్బతీశాడు. ఈ వివాదం అతని భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి.


