
📌 Key Points
- టాలీవుడ్ నటి ట్విషా శర్మ పెళ్లయిన ఐదు నెలలకే అత్తవారింట్లో అనుమానాస్పదంగా మృతి.
- ప్రేమించి లాయర్ సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకున్న ట్విషాకు కట్నం వేధింపులు తప్పలేదు.
- భర్త, అత్త గిరిబాలా సింగ్ శారీరకంగా, మానసికంగా హింసించారని మృతికి ముందు మెసేజ్‌లు.
- మిస్ పుణెగా గెలిచి, ఎంబీఏ పూర్తి చేసి, సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ట్విషా విషాద ముగింపు.
టాలీవుడ్ నటి ట్విషా శర్మ మృతి కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐదు నెలలకే ఆమె అత్తవారింట్లో నరకం చూసిందని, కట్నం వేధింపులే ఆమె మృతికి కారణమని వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా బయటపడింది. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.
మిస్ పుణె టు టాలీవుడ్: ట్విషా కెరీర్
Twisha Death : మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్, టాలీవుడ్ నటి అయిన ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్‌లో ఉన్న అత్తవారింట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెల్సిందే. అందం, అమాయకత్వం, చదువు, సినిమా అవకాశాలు.. ఇలా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువతి పెళ్లయిన కేవలం ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడం అందరినీ పెద్ద షాక్ కి గురి చేసింది. అయితే తాజాగా ఈ మృతి వెనుకున్న అసలు నిజాలుఇపుడు బయటపడుతున్నాయి.ప్రేమించి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన ట్విషాకి ఆ ఇల్లే నరకంగా మారిందని, చనిపోవడానికి ముందు ఆమె పంపిన మెసేజ్ లతో క్లారిటీ వచ్చేస్తుంది.
ట్విషా శర్మ కెరీర్ మొదలెట్టినప్పటి నుండే
విషయంలోకి వెళ్తే ..ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ కెరీర్ మొదలెట్టినప్పటి నుండే తన ప్రతిభని చాటింది. 2012లో ప్రతిష్టాత్మక ‘మిస్ పుణె’ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఆమె, ఆ తర్వాత మోడలింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది.ఆ క్రమంలోనే పలు టాప్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసింది.ఇక చదువులోనూ ముందుండే ట్విషా, ఎంబీఏ పూర్తి చేసి ఒక ప్రముఖ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేసింది కూడా.ఇక గ్లామర్ ప్రపంచంపై ఉన్నఇష్టంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన ట్విషా తెలుగులో 2021 ఆగస్టు 27న విడుదలైన శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో కీలక పాత్ర పోషించి టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైంది.
డేటింగ్ యాప్ తో లాయర్ సమర్థ్ సింగ్‌తో పరిచయం
డేటింగ్ యాప్ తో పరిచయం.. ప్రేమ వివాహం
అయితే జీవితంలో ఎంతో ఎదగాల్సిన ట్విషా శర్మకు ఒక డేటింగ్ యాప్ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, ఇరు కుటుంబాలను ఒప్పించి గత ఏడాది 2025, డిసెంబర్‌లో వారు ఘనంగా వివాహం చేసుకున్నారు కూడా.అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె జీవితం నరకంగా మారిందని తెలుస్తుంది. భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ (విశ్రాంత న్యాయమూర్తి)లు ఎక్కువ కట్నం తేవాలంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా టార్చర్ పెట్టారని సమాచారం.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు తన తల్లికి, స్నేహితురాలికి పంపిన వాట్సాప్ మెసేజ్ లు ఇప్పుడు బయటపడి సెన్సేషన్ అవుతున్నాయి.ఏప్రిల్ 30న పంపిన మెసేజ్‌లో “అమ్మా.. నన్ను ఇక్కడ బతకనివ్వరు.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి.. నా జీవితం నరకంలా మారింది” అంటూ మనసులోని బాధని మెసేజ్ లో వెళ్ళగక్కింది. ఆ తర్వాత మే 7న పంపిన మరో సందేశంలో “ఇక్కడ ఏదీ సరిగా లేదు, నేను ఈ బంధంలో ఇరుక్కుపోయాను” అని ట్విషా పేర్కొనడం చూస్తుంటే ఆమె ఎంతటి మానసిక క్షోభ అనుభవించిందో అర్థమవుతోంది.
ఐదు నెలలకే నరకం.. కట్నం వేధింపులు
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్
ఇక తాజాగా ట్విషా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించారు. నిందితులు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ముందస్తు బెయిల్ పొందడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితుడైన భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉండగా, అతడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.10 వేల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. ఒక సెలబ్రిటీ, విద్యావంతురాలైన మహిళకే అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ట్విషా శర్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి, ఆమెకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తోంది.చూడాలి మరి న్యాయం కాస్త లేటైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న సామెత నిజమవుతుందో లేదో !
ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతి ప్రేమ వివాహం చేసుకుని ఐదు నెలలకే ఇలా విషాదంగా ముగియడం అత్యంత బాధాకరం. ఈ కేసులో న్యాయం జరిగి, నిందితులకు కఠిన శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.


