
చిన్నారి పెళ్లికూతురు ఖ్యాతిని సంపాదించుకున్న అవికా గోర్, తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో నిశ్చితార్థం చేసుకుంది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Key Points
అవికా గోర్, మిలింద్ చంద్వానీ నిశ్చితార్థం
5 ఏళ్ల ప్రేమాయణం తర్వాత ఎంగేజ్‌మెంట్
సోషల్ మీడియాలో ఫోటోలు షేర్
అవికా గోర్ యొక్క ఉత్తేజకరమైన అనుభవం
అవికా గోర్ నిశ్చితార్థం
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో సెన్సేషన్ సృష్టించిన అవికా గోర్ ( Avika Gor ) పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సంతోషంతో అరిచేశా.. ఈ సందర్భంగా అవికా.. ‘ఆయన నోరు తెరిచి అడగ్గానే.. సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్‌లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్‌లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.
ఐదేళ్ల ప్రేమాయణం
కన్నీళ్లు.. ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలియాడిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని అవికా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కెరీర్ ముంబైలో పుట్టిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ‘బాలికా వధు’ సీరియల్‌తో ఆమె జీవితమే మారిపోయింది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘బ్రో’, ‘షణ్ముఖ’ ఇలా అనేక సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలో ఫోటోలు
అవికా గోర్ మరియు మిలింద్ చంద్వానీల నిశ్చితార్థం టాలీవుడ్‌లో హర్షం నింపింది. వారి ప్రేమాయణానికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


