|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూజా హెగ్డేకు కోసం టాలీవుడ్ హీరో భారీ రిస్క్!

Published: 11-06-2025, 12:49 PM
పూజా హెగ్డేకు కోసం టాలీవుడ్ హీరో భారీ రిస్క్!

టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన పూజా హెగ్డేకు ఇటీవల కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే, ఆమెకు మరో అవకాశం దొరకనుందని వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య తన తదుపరి చిత్రంలో ఆమెను నటింపజేయాలని భావిస్తున్నాడట.

Key Points

1

టాలీవుడ్‌లో పూజా హెగ్డేకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

2

నాగచైతన్య తన తదుపరి సినిమాలో పూజా హెగ్డేని తీసుకోవాలని అనుకుంటున్నాడు.

4

పూజా హెగ్డే ఫ్యామిలీకి దర్శకుడు దగ్గరగా ఉండటం ఈ ప్రయత్నాలకు కారణం.

పూజా హెగ్డే కెరీర్‌లో మలుపు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది తొందరగా సక్సెస్ అయి ముందుకు వెళ్తుంటే… మరి కొంత మంది హీరోయిన్లు.. వరస డిజాస్టర్లతో వెనుకబడి పోతున్నారు. అయితే డిజాస్టర్ల కారణంగా.. తెలుగులో ఛాన్సులు దక్కక సతమతమవుతున్న హీరోయిన్లలో… పూజా హెగ్డే (Pooja hegde) ఒకరు.

నాగచైతన్య – పూజా హెగ్డే కాంబినేషన్?

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్య, ప్రభాస్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ లాంటి బడా హీరోలతో.. సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది పూజా హెగ్డే. అయితే అలాంటి హీరోయిన్ పూజా హెగ్డేకు ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావడం లేదు. అలా వైకుంఠపురం, రాదే శ్యామ్ లాంటి సినిమాల తర్వాత ఆమెకు తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు. గుంటూరు కారం సినిమా చేతుల దాకా వచ్చి వెళ్ళిపోయింది.

దర్శకుడి ప్రయత్నాలు

అయితే ఇలాంటి నేపథ్యంలో.. పూజా హెగ్డే కు బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు తెలుగు హీరో ముందుకు వచ్చాడట. అక్కినేని నాగచైతన్య… త్వరలోనే ఓ రొమాంటిక్ స్టోరీ తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో పూజా హెగ్డే ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఓ ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ఫ్యామిలీకి ఆదర్శకుడు బాగా క్లోజ్ అని సమాచారం. అందుకే ఆమెకు లైఫ్ ఇవ్వాలని ఇలా ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

నాగచైతన్య సినిమాలో పూజా హెగ్డే నటించే అవకాశంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా పూజా హెగ్డే కెరీర్‌కు మళ్ళీ ఊపందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.