
📌 Key Points
- అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్‌లో రూ. 100 కోట్ల విలాసవంతమైన బ్లెస్సింగ్స్ మాన్షన్ హౌజ్‌తో టాప్!
- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జూబ్లీ హిల్స్‌లోని తన రూ. 60-70 కోట్ల విలువైన లగ్జరీ హౌజ్‌తో రెండవ స్థానంలో నిలిచారు.
- కింగ్ నాగార్జున జూబ్లీ హిల్స్‌లో రూ. 45 కోట్ల ఖరీదైన ఇంటితో రిచ్చెస్ట్ హీరోగా సంచలనం.
- మెగాస్టార్ చిరంజీవి రాయల్ లుక్ ఇంటీరియర్‌తో జూబ్లీహిల్స్‌లో రూ. 35 కోట్ల విలువైన ఇంట్లో నివాసం.
టాలీవుడ్‌లో పాన్ ఇండియా హీరోల హవా నడుస్తోంది. భారీ పారితోషికాలు తీసుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే, మన హీరోల ఇళ్ల విలువ గురించి మీకు తెలుసా? ఎవరి ఇల్లు ఎంత ఖరీదైనదో ఇప్పుడు చూద్దాం రండి!
బన్నీ లగ్జరీ లైఫ్: బ్లెస్సింగ్స్ మాన్షన్ విశేషాలు!
టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ హీరోల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. అదే సమయంలో భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోల ట్రెండ్ కూడా నడుస్తుంది. ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మరో ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరి కాస్ట్లీ ఇళ్లు ఉన్న హీరో ఎవరనేది టాప్ 5 లిస్ట్ చూస్తే.
టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో అల్లు అర్జున్. ఆయనకు జూబ్లీ హిల్స్ లో బ్లెస్సింగ్ పేరుతో లగ్జరీ మాన్షన్ హౌజ్ ఉంది. అత్యాధునిక సధుపాయాలతో, విలాసవంతంగా ఈ ఇళ్లు ఉంటుంది. ఇటీవలే అల్లు అర్జున్ ఈ ఇంటిని దగ్గరుండి కట్టించుకున్నారు. దీని విలువ వందకోట్లు ఉంటుందని అంచనా.
ప్రభాస్ బంగ్లా: అంత ప్రైవసీ ఎందుకో తెలుసా?
ఇక బన్నీ తర్వాత అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో ప్రభాస్. ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా రాణిస్తున్న ప్రభాస్‌కి జూబ్లీ హిల్స్ లో లగ్జరీ హౌజ్ ఉంది. ఆల్ట్రా ప్రీమియమ్ బంగ్లా ఇది. చాలా ప్రైవసీగా, సెక్యూరిటీగా ఉంటుంది. ప్రభాస్ ఇంటి విలువ సుమారు రూ.60-70కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆయన పాన్ ఇండియా గేమ్ లో లేరు. బాక్సాఫీసు పోటీలోనూ లేరు. కానీ ఆస్తుల పరంగా తెలుగులోనే రిచ్చెస్ట్ హీరో కావడం విశేషం. నాగార్జున జూబ్లీ హిల్స్ లో ఉంటారు. అత్యాధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌తో, లగ్జరీగా ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన ఇంటి విలువ రూ.45కోట్లు ఉంటుందని టాక్.
కింగ్ నాగార్జున ఇల్లు: బాక్సాఫీస్ కింగ్ కాకపోయినా రిచ్చేస్ట్ ఎలా?
ఇక టాలీవుడ్ లో మెగాస్టార్‌గా రాణిస్తున్న చిరంజీవి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ లోనే చిరంజీవికి ఇళ్లు ఉంది. రాయల్ లుక్‌ని తలపించేలా, ఇంటీరియర్‌తో చిరంజీవి హౌజ్ ఉంటుంది. దీని విలువ రూ.35కోట్లు ఉంటుందని టాక్.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా జూబ్లీహిల్స్ లోనే ఇళ్లు ఉంది. అత్యధునిక సధుపాయాలతో ఆయన ఇళ్లు ఉంటుంది. అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి. దీని విలువ సుమారు రూ.30కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్నది ఈ హీరోలే అని, మిగిలిన హీరోల ఇళ్ల విలువ పది, పదిహేను కోట్ల లోపే ఉంటాయని టాక్. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారం మాత్రమే.
టాలీవుడ్ హీరోల ఇళ్ల గురించి ఈ విషయాలు మీకు షాక్ ఇచ్చాయా? మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


