
📌 Key Points
- టాలీవుడ్ సింగర్ గీతామాధురి, నందుల ప్రపోజల్ సీక్రెట్ బయటపెట్టింది.
- ముందుగా నందుకి తనే ప్రపోజ్ చేసినట్లు గీతామాధురి వెల్లడించింది.
- వారి పరిచయం ‘మీరు’తో మొదలై ‘నువ్వు’, ‘ఒసేయ్’, ‘ఒరేయ్’ మీదుగా ‘బుజ్జి’ వరకు సాగింది.
- 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు.
టాలీవుడ్ ప్రముఖ సింగర్ గీతామాధురి తన భర్త నందుతో తన ప్రేమ ప్రయాణాన్ని, ప్రపోజల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన సీక్రెట్‌ను బయటపెట్టింది. వారి పరిచయం ‘మీరు’ నుంచి ‘నువ్వు’గా, ఆపై ‘బుజ్జి’ అనే పిలుపు వరకు ఎలా మారిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
గీతామాధురి – నందు పరిచయం ఎలా?
టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో గీతామాధురి అంటే తెలియనివారు ఉండరు. ఎన్నో సెన్సేషన్ సాంగ్స్ పాడి ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక నందూతో ఆమె పెళ్లి, పిల్లలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమ ప్రపోజల్ సీక్రెట్ గురించి గీతా మాధురి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. గీతామాధురి భర్త నందు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.
ఆమెనే ముందు ప్రపోజ్ చేసింది ఎలా?
గీతామాధురి – నందు జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరిగా నిలిచారు. తమ ప్రేమ, ప్రపోజల్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ పరిచయం ముందు ఫ్రెండ్స్ గా స్టార్ట్ అయినట్లు చెప్పారు. ముందుగా నందుకు తనే ప్రపోజ్ చేసినట్లు తెలిపారు. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదని, ఇద్దరి మైండ్ సెట్ మ్యాచ్ అవుతుందని చెప్పినట్లు పేర్కొన్నారు. నిదానంగా తమ మధ్య పరిచయం మీరు నుంచి నువ్వు వరకూ పెరిగిందని, ఆ తర్వాత ఒసేయ్, ఒరేయ్ వరకు, ఆపై ఏంటి బుజ్జికి వచ్చిందన్నారు. అలా ఇద్దరి మైండ్స్, మనసులు కలిశాయన్నారు.
‘మీరు’ నుంచి ‘బుజ్జి’ వరకు ప్రేమ ప్రయాణం
2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు. గీతామాధురి సింగర్ గా సెటిలవ్వగా.. నందు యాంకర్ గా, యాక్టర్ గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం నందు నటించిన సైక్ సిద్ధార్థ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
గీతామాధురి-నందుల ఈ సరదా ప్రేమకథ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాధారణంగా జరిగే ప్రపోజల్‌కు భిన్నంగా, మనసులు కలిసిన విధానాన్ని వివరించడం వారి బంధంలోని ప్రత్యేకతను చాటుతుంది. ఇద్దరూ తమ కెరీర్‌లో రాణిస్తూనే ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు.


