|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తన మూవీలో అవకాశం ఇచ్చి నా తొడల సైజ్ అడిగాడు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన నటి.. దుమారం రేపుతున్న పోస్ట్

Published: 04-06-2025, 4:32 AM
తన మూవీలో అవకాశం ఇచ్చి నా తొడల సైజ్ అడిగాడు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన నటి.. దుమారం రేపుతున్న పోస్ట్

టాలీవుడ్‌లో మరో కాస్టింగ్ కౌచ్ వివాదం తెరమీదకు వచ్చింది. నటి మౌనీషా చౌదరి తనతో ఓ స్టార్ డైరెక్టర్ చేసిన అనుచిత ప్రవర్తనను బయటపెట్టింది. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Key Points

1

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన సినిమాలో అవకాశం ఇచ్చానని చెప్పి నటి తొడల సైజు అడిగాడు.

2

నటి మౌనీషా చౌదరి ఈ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

4

కాస్టింగ్ కౌచ్ సమస్యపై మరోసారి చర్చ జరుగుతుండటం గమనార్హం.

మౌనీషా చౌదరి సంచలన వెల్లడి

గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతున్నట్లు పలువురు సంచలన విషయాలు బయటపెట్టడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దర్శక నిర్మాతలకు కమిట్మెంట్స్ ఇవ్వాలని అలా అయితేనే ఆఫర్లు ఇస్తారని చాలామంది అంటున్నాను.ఇక కొత్త నటీనటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలంటే ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంటున్నట్లు సెలబ్రిటీలు వెల్లడించిన సంగతి తెలిసిందే. వారు చెప్పింది చేస్తేనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయని లేదంటే అక్కడితోనే కెరీర్ ఆగిపోయేలా చేస్తారని హీరోయిన్లు ఈ విషయం గురించి బహిరంగంగానే మాట్లాడారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మోడల్, నటి మౌనీషా చౌదరీ (Mounisha Chaudhary) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన విషయాలను బయటపెట్టింది. ‘‘ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సినిమాలలో నటించమని నన్ను కోరారు.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్

ఇక తన మూవీలోనూ నటించాలని నాకు ఆఫర్ కూడా ఇస్తానని చెప్పారు. కానీ నాకు మాత్రం నటించడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ అతను మాత్రం వినకుండా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టాడు. అంతేకాకుండా ఒకరోజు నా తొడల కొలతలను కూడా అడిగి టార్చర్ పెట్టారు. ఇప్పుడు మాత్రం అతను పెద్ద సెలబ్రిటీలతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు’’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మౌనిషా ఆ డైరెక్టర్ పేరు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ డైరెక్టర్ ఎవరా అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.

నెటిజన్ల ఆసక్తి

A post shared by Mouneesha Chowdary 🎀 (@eeshablogs)

ఈ సంఘటన టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ సమస్యపై మళ్ళీ చర్చను రేకెత్తించింది. డైరెక్టర్‌ను గుర్తించే ప్రయత్నాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.