|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమానే కాదు.. భోజనంలోనూ టాలీవుడ్ తారల హవా! ఏయే స్టార్స్ ఏ రెస్టారెంట్ నడుపుతున్నారో తెలుసా?

Published: 06-04-2026, 11:35 AM
సినిమానే కాదు.. భోజనంలోనూ టాలీవుడ్ తారల హవా! ఏయే స్టార్స్ ఏ రెస్టారెంట్ నడుపుతున్నారో తెలుసా?
  • మహేష్ బాబు బంజారాహిల్స్‌లో ‘ఏఎన్ రెస్టారెంట్’ ప్రారంభించారు.
  • రకుల్ ప్రీతిసింగ్ హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో రెస్టారెంట్ నడుపుతున్నారు.
  • నాగచైతన్య మాదాపూర్‌లో ‘షోయు’ రెస్టారెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
  • అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లో ‘బఫెలో వైల్డ్ వింగ్స్’ రెస్టారెంట్‌ను స్థాపించారు.

టాలీవుడ్ సెలెబ్రిటీలు సినిమాతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. చాలామంది హీరోలు రెస్టారెంట్ బిజినెస్‌పై దృష్టి సారించి సక్సెస్ అవుతున్నారు. హైదరాబాద్‌లో పలువురు స్టార్స్ నడుపుతున్న రెస్టారెంట్ల గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో టాలీవుడ్ స్టార్స్ రెస్టారెంట్లు

Tollywood Stars : సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలను కూడా ప్రారంభిస్తూ అందులో కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ప్రొడక్షన్ వైపు అడుగులు వేయగా మరి కొంతమంది రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. మరి కొంతమంది థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు ఎక్కువగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. మరి హైదరాబాదులో టాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ల విషయానికి వస్తే..

మహేష్ బాబు హీరోగా మాత్రమే కాకుండా సినిమా థియేటర్ ఓనర్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే ఈయన హైదరాబాద్ బంజారాహిల్స్ లో “ఏఎన్ రెస్టారెంట్” ప్రారంభించారు. ఏషియన్ వారితో భాగస్వామ్యం అయ్యి ఈ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇక ఈ రెస్టారెంట్ బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు .

రకుల్ ప్రీతిసింగ్: నటి రకుల్ ప్రీతిసింగ్ ఇప్పటికే జిమ్ సెంటర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే .అయితే హైదరాబాద్లో “ఆరంభం” అనే పేరిట ఈమె రెస్టారెంట్ ప్రారంభించారు.

నాగచైతన్య: నాగచైతన్య “షోయు” పేరుతో గత కొంతకాలంగా రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మాదాపూర్ లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ మంచి సక్సెస్ అందుకుంది.

సక్సెస్ అయిన సెలెబ్రిటీల వ్యాపారాలు

అల్లు అర్జున్: అల్లు అర్జున్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.ఈయన ఇప్పటికే స్టూడియోస్, అల్లు థియేటర్స్ ఏర్పాటు చేశారు .ఇక రెస్టారెంట్ బిజినెస్ లో కూడా సక్సెస్ అందుకున్నారు. “బఫెలో వైల్డ్ వింగ్స్” పేరిట జూబ్లీహిల్స్ లో రెస్టారెంట్ ప్రారంభించి మంచి సక్సెస్ అందుకున్నారు.

నాగార్జున: నాగార్జున ఇప్పటికి ఎన్నో వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన కూడా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ లో “ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్” పేరిట రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.

రానా దగ్గుబాటి: రానా దగ్గుబాటి కుటుంబం కూడా గత కొంతకాలంగా రెస్టారెంట్ బిజినెస్ లు నిర్వహిస్తూ వచ్చారు. ఈయన “శాంకుర్చీ అండ్ బ్రాడ్ వే” రెస్టారెంట్ నిర్వహిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.

విజయ్ దేవరకొండ: విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి “గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్” పేరిట మణికొండలో ఒక కేఫ్ నిర్వహిస్తున్నారు.

రెస్టారెంట్ రంగంలో రాణిస్తున్న హీరోలు

నితిన్: టాలీవుడ్ అండ్ హీరో నితిన్ సైతం రెస్టారెంట్ బిజినెస్ లోఅడుగు పెట్టారు. ఈయన “టీ గ్రిల్” పేరిట ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా పేరుగాంచిన కోకాపేటలో ఉండటం విశేషం.

సందీప్ కిషన్: టాలీవుడ్ మరో యంగ్ హీరో సందీప్ కిషన్ సైతం రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు ఈయన “వివాహ భోజనం” పేరిట జూబ్లీహిల్స్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ హీరోలందరూ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

టాలీవుడ్ స్టార్లు సినిమా రంగంతో పాటు ఇతర వ్యాపారాలలో కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్‌లో తమ సత్తా చాటుతూ అభిమానులకు విభిన్న అనుభూతులను అందిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.