
📌 Key Points
- పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం! ‘అత్తారింటికి దారేది’ షూటింగ్ చూడటానికి వెళ్ళిన సంతోష్ శోభన్.
- లాఠీ ఛార్జ్ లో దెబ్బలు తిన్న సంతోష్! పవన్ కళ్యాణ్ కోసం ఎంతటి సాహసమైనా చేసేందుకు సిద్ధం.
- ఫిబ్రవరి 14న ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా విడుదల! సంతోష్ శోభన్ కెరీర్ లో ఇది ఒక మైలురాయి కానుందా?
- సంతోష్ శోభన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా! సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు!
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనంటే ప్రాణమిచ్చే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఓ యంగ్ హీరో పవన్ కళ్యాణ్ కోసం పోలీసుల దెబ్బలు తిన్నాడంటే నమ్ముతారా? ఆ వివరాలు చూద్దాం!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని సంతోష్ శోభన్!
మెగాస్టార్ చిరంజీవి తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్. చిరంజీవిని ప్రేరణగా తీసకుని ఇండస్ట్రీకి వచ్చినవారు ఎందరో.. అందులో స్టార్స్ కూడా ఉన్నారు. మెగాస్టార్ కు సామాన్యులే కాదు.. ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో కూడా అభిమానులు ఉన్నారు.
అలాగే చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడం సహజమే.
‘అత్తారింటికి దారేది’ షూటింగ్ లో లాఠీ ఛార్జ్!
పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన కోసం అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. పవన్ వస్తున్నాడంటే జనాలను కంట్రోల్ చేయడం కష్టంగా మారేది. ఇప్పటికీ అదే ఫాలోయింగ్ ఉంటుంది పవర్ స్టార్ కు. కొన్ని సందర్భాల్లో అభిమానుల రద్దీని అదుపు చేయడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ సినిమా కోసం.. జనాలమధ్య నలిగిపోయిన సెలబ్రిటీల గురించి గతంలో చూశం.. కానీ పవర్ స్టార్ ను చూడాలన్న ఆశతో.. పోలీసు దెబ్బలు తిన్న స్టార్ హీరో గురించి మీకు తెలుసా? ఆ హీరో మరెవరో కాదు.. సంతోష్ శోభన్. పవన్ కళ్యాణ్ కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం “కపుల్ ఫ్రెండ్లీ” అనే సినిమాతో వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫిబ్రవరి 14న ‘కపుల్ ఫ్రెండ్లీ’ విడుదల!
సంతోష్ శోభన్ మాట్లాడుతూ, “నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని.. ఆయను చూడాలని ఎప్పటి నుంచో ఆశ.. ఆయన్ను ఎప్పుడూ ఎక్కువగా చూడలేదు. ఒక సారి అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో ఆయనను చూడటానికి వెళ్లాను. అప్పటికే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చాలా ఎక్కువ. ఆ షూటింగ్ అవుట్‌డోర్‌లో జరుగుతుండటంతో చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు” అని తెలిపారు.
అభిమానుల రద్దీ ఎక్కువ కావడంతో షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో పోలీసులు లాఠీలతో నియంత్రించేందుకు ప్రయత్నించారు. కొంతమంది అభిమానులతో పాటు నాకు కూడా లాఠీ దెబ్బలు పడ్డాయి” అని సంతోష్ శోభన్ వెల్లడించారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంతోష్ శోభన్ పవన్ కళ్యాణ్ అభిమానం గురించి తెలుసుకున్నారు కదా. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో సంతోష్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


