
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ తనకన్నా సగం వయసున్న నటి అనా డి ఆర్మాస్‌ను పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ ప్రేమ జంట ఏకంగా అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టామ్‌కు ఇది నాలుగో పెళ్లి కాగా, అనాకు రెండో పెళ్లి. ఈ ఆసక్తికర పెళ్లి వార్త ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
Key Points
63 ఏళ్ల టామ్ క్రూజ్, అనా డి ఆర్మాస్‌ను వివాహం చేసుకోబోతున్నాడు.
వీరి పెళ్లి ఏకంగా అంతరిక్షంలో జరిగే అవకాశం ఉంది.
టామ్ క్రూజ్‌కు ఇది నాలుగో పెళ్లి కాగా, అనాకు రెండో పెళ్లి.
గతంలో ఇద్దరికీ వివాహ బంధాలు, విడాకులు ఉన్నాయి.
టామ్ క్రూజ్: 63 ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్లి
Tom Cruise-Ana de Armas: హాలీవుడ్ స్టార్ టాప్ క్రూజ్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సినిమాల్లో ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల కోసం ప్రాణం పెట్టేయడం అని పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే టామ్ క్రూజ్ అనే చెప్పాలి. బైక్ స్టంట్లు, ఫ్లైట్స్ నుంచి దూకేయడం, రియల్ స్టంట్లు చేయడంలో(Tom Cruise-Ana de Armas) ఆయన తోప్. మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాల్లో ఆయన యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 63 ఏళ్ళ వయసులో కూడా ఆయన చేసే స్టంట్లు ఒళ్ళు గగుర్పొడిపించడం ఖాయం.
Aishwarya Rai: దిమ్మతిరిగే షాకిచిన ఐశ్వర్య.. యూట్యూబ్ పై రూ.4 కోట్ల పరువు నష్టం దావా.. చెప్పినప్పుడు వినాలిగా!
అనా డి ఆర్మాస్‌తో అంతరిక్షంలో పెళ్లి ప్లాన్
అయితే, ఈ స్టార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అదేదో సినిమా గురించి కాదు.. పెళ్లి గురించి. అవును, 63 ఏళ్ళ లేట్ వయసులో మనోడు మళ్ళీ పెళ్ళికి సిద్దమయ్యాడట. అది కూడా తనలో సగం వయసులో హాలీవుడ్ స్టార్ బ్యూటీ అనా డి ఆర్మాస్ తో. అవును, చాలా కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉన్నారట. ఇప్పుడు ఆ రిలేషన్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి రెడీ అవుతున్నారట. ఆ పెళ్లి కూడా ఆశామాషీగా కాకుండా ఏకంగా అంతరిక్షంలో చేసువుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
టామ్, అనా గత వివాహ బంధాలు
తన సినిమాల మాదిరిగానే తన పెళ్లి గురించి కూడా జనాలు మాట్లాడుకోవాలని ఇలా ప్లాన్ చేస్తున్నాడట టామ్ క్రూజ్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక టామ్ క్రూజ్ విషయానికి వస్తే, గతంలోనే ఆయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదట ఆయన మిమి రోజర్స్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత నికోల్ కిడ్‌మన్, కేటీ హోమ్స్ లను వివాహం చేసుకుని ఆపై విడాకులు ఇచ్చాడు. ఈ హీరోయికి ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. ఇక అనా డి ఆర్మాస్ కూడా గతంలో మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్టర్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తరువాత హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్, క్యూబా అధ్యకుడి కుమారుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇప్పుడు తనకన్నా రెట్టింపు వయసున్న టామ్ క్రూజ్‌తో రెండో పెళ్లికి సిద్దమయ్యింది. మరి వీరి బంధం ఎంతకాలం వరకు ఉంటుందో చూడాలి.
టామ్ క్రూజ్, అనా డి ఆర్మాస్ ల అంతరిక్ష పెళ్లి వార్త నిజంగా ఆశ్చర్యకరం. ఈ కొత్త బంధం ఎంతకాలం కొనసాగుతుందో, వారి నాలుగో, రెండో పెళ్లి ఎంత అద్భుతంగా ఉంటుందో వేచి చూడాలి. ఇది హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


