|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీ-కమల్ మల్టీస్టారర్‌లో త్రిష.. 12 కోట్లతో ‘సౌత్ క్వీన్’ సంచలనం!

Published: 11-05-2026, 5:45 PM
రజనీ-కమల్ మల్టీస్టారర్‌లో త్రిష.. 12 కోట్లతో 'సౌత్ క్వీన్' సంచలనం!
  • రజనీకాంత్, కమల్ హాసన్ 40 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రంలో త్రిష భాగం.
  • నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి త్రిషకు 12 కోట్ల ఆఫర్.
  • త్రిష ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
  • రజనీ, కమల్‌లతో గతంలో విడివిడిగా నటించిన త్రిష ఇప్పుడు ఒకే సినిమాలో భాగం.

త్రిష కృష్ణన్ కెరీర్ ఇప్పుడు అద్భుతమైన దశలో ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు 40 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమాలో త్రిష కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెకు భారీగా 12 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

త్రిష కెరీర్‌లో కొత్త మలుపు

Trisha krishnan: త్రిష కృష్ణన్…ఇప్పుడీ పేరు సౌత్ లో ఒక సెన్సేషన్.ఒకవైపు తన స్నేహితుడు విజయ్ తమిళనాడు సీయం కావడం,మరో వైపు సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు టాప్ స్టార్ ఎన్నో ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమాలో భాగం అయిందన్న వార్తలు రావడంతో ఈ చెన్నై చిన్నది ఒక్కసారి గా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపొయింది.దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న త్రిష ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదే జోష్ కంటిన్యూ చేయడం విశేషం.

నలబై ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమాలో

ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ దాదాపు నలబై ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమాలో త్రిష కూడా ఆన్ బోర్డ్ అయిందన్న వార్తలు ఇపుడు కోలీవుడ్ ని షేక్ చేస్తున్నాయ్. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో త్రిష కీరోల్ పోషించబోతుందని సమాచారం. అందుకే ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేశారని ఇన్ సైడ్ టాక్.

రజనీ-కమల్ చిత్రంలో త్రిష పాత్ర

సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్

ఇక ఇదే రజినీతో ‘పేట’ (2019)సినిమాలో మెరిసిన త్రిష, కమల్ హాసన్‌తో ‘మన్మధన్ అంబు’ (2010), ‘తూంగవనం’ (2015) వంటి విభిన్న సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే వేరు వేరుగా ఇద్దరితో కలిసి నటించిన ఈ బ్యూటీ ఇపుడు ఒకే సినిమాలో ఇద్దరు కోలీవుడ్ కింగ్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇక ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించబోతున్నాడని తెలుస్తుంది.

12 కోట్ల రెమ్యూనరేషన్ వెనుక రహస్యం

సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో

మొత్తానికి త్రిష డైరీ టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉందనే చెప్పాలి.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో నటిస్తుండగా, 1980s రజనీ-కమల్ కలిసి నటించిన తర్వాత మళ్లీ అటువంటి మ్యాజిక్ రిపీట్ కాబోతున్న నెల్సన్ మూవీలో త్రిష సెలెక్ట్ కావడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పక తప్పదు. ఒకవైపు తన స్నేహితుడి విజయంలో పాలు పంచుకుంటునే మరో వైపు సాలిడ్ రెమ్యూనరేషన్ తో టాప్ స్టార్స్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం చూస్తుంటే త్రిష నక్క తోక తొక్కినట్టే కనిపిస్తుంది. చూడాలి మరి సర్కులేట్ అవుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

ఈ వార్తలు నిజమైతే, త్రిష కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. అయితే, ఈ సంచలన వార్తలపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.