
📌 Key Points
- విజయ్‌తో త్రిష సంబంధంపై పార్థిబన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష స్పందించారు.
- పార్థిబన్ కూతురు కీర్తనతో కలిసి త్రిష ఫోటోలు దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
- స్టైలిస్ట్ ఏకా లఖానీ వివాహ వేడుకలో త్రిష, కీర్తన పాల్గొన్నారు.
- మణిరత్నం, సిద్ధార్థ్‌లతో కలిసి త్రిష ఫోటోలు దిగారు, పట్టు చీరలో మెరిశారు.
ప్రముఖ నటి త్రిష, పార్థిబన్ కూతురు కీర్తనతో కలిసి వివాహ వేడుకలో పాల్గొనడం ఆశ్చర్యం కలిగించింది. విజయ్‌తో ఆమెకున్న సంబంధం గురించి పార్థిబన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించిన కొన్ని రోజులకే ఇది జరిగింది.
పార్థిబన్ వ్యాఖ్యలపై త్రిష కౌంటర్
Trisha Krishnan: ప్రముఖ హీరోయిన్ త్రిష.. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. నటుడు విజయ్‌తో ఆమెకు సంబంధం ఉందనే పుకార్లు, అలాగే దర్శకుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న సమయంలో త్రిష చేసిన ఒక పని అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్థిబన్‌పై తీవ్రంగా స్పందించిన త్రిష, తాజాగా అతని కూతురితో కలిసి ఫొటోలు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.
ఇటీవల స్టైలిస్ట్ ఏకా లఖానీ.. రవి భగచంద్‌కా వివాహ వేడుకలో త్రిష పాల్గొన్నారు. ఆ పెళ్లి వేడుకలో తీసుకున్న కొన్ని ఫొటోలు మరియు వీడియోలను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో దర్శకుడు ఆర్. పార్థిబన్ కూతురు కీర్తనతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.
త్రిష తన సోషల్ మీడియా స్టోరీస్‌లో పెళ్లికి సంబంధించిన అనేక క్షణాలను అభిమానులతో పంచుకుంది. వధూవరుల వీడియోను షేర్ చేస్తూ పెళ్లి ఎంతో అందంగా జరిగిందని, వధువు చాలా అందంగా కనిపించిందని ఆమె పేర్కొంది. అలాగే ఉత్తర భారత పెళ్లిళ్లకు ప్రత్యేకమైన వాతావరణం ఉంటుందని చెప్పుతూ మరో వీడియోను కూడా పోస్ట్ చేసింది.
కీర్తనతో కలిసి త్రిష సందడి
ఈ వేడుకలో త్రిష, కీర్తనతో పాటు మరికొంతమంది అతిథులతో కలిసి సెల్ఫీలు కూడా దిగింది. ఆ ఫొటోలను చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే పార్థిబన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించింది. మైక్ చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడకూడదని ఆమె బహిరంగంగా హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, అదే వేడుకలో ప్రముఖ దర్శకుడు మణిరత్నంను కూడా త్రిష కలిసింది. ఆయనతో కలిసి ఒక ఫోటో దిగింది. ఆ ఫోటోలో నటుడు సిద్ధార్థ్ కూడా కనిపించాడు. అంతేకాకుండా త్రిష తన పర్పుల్ రంగు పట్టు చీరలో తీసుకున్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. బంగారు ఆభరణాలతో సంప్రదాయంగా కనిపించిన ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
మణిరత్నంతో త్రిష ఫోటోలు
విజయ్‌తో త్రిష సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదంగా మారాయి. ఆ వ్యాఖ్యలకు త్రిష కఠినంగా స్పందించడంతో విషయం మరింత చర్చకు వచ్చింది. అయితే ఇప్పుడు పార్థిబన్ కూతురితో కలిసి త్రిష ఫొటోలు దిగడం చాలా మందికి కొత్త ట్విస్ట్‌లా అనిపిస్తోంది.
మొత్తానికి, త్రిష పార్థిబన్ కూతురితో కలిసి కనిపించడం, మణిరత్నంతో ఫోటోలు దిగడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఈ సంఘటనలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


