
📌 Key Points
- తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ దళపతిపై ప్రశంసలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- విజయ్ రాజకీయ రంగ ప్రవేశం నుండి సీఎం అయ్యే వరకు త్రిష ఆయన వెంటే ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
- త్రిష తన పుట్టినరోజున తిరుమల నుండి విజయ్ ఇంటికి వెళ్లి శ్రీవారి ప్రసాదం అందించడం చర్చనీయాంశమైంది.
- ప్రభుత్వ వ్యవహారాలలో త్రిష జోక్యంపై వస్తున్న వార్తలకు సీఎం విజయ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన పాలనలో సినీ నటి త్రిష జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై సీఎం విజయ్ పరోక్షంగా స్పందిస్తూ, తన ప్రభుత్వంలో రెండో పవర్ సెంటర్ ఉండదని స్పష్టం చేశారు.
విజయ్ ప్రమాణ స్వీకారం: ప్రశంసలు, విమర్శలు
Vijay Thalapathy: టీవీకే పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలోనే తమిళనాట ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై ఎక్కడ చూసినా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 234 స్థానాలలో పోటీ చేయగా 108 స్థానాలను కైవసం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. మరో ఎన్టీఆర్, ఎంజీఆర్ లను విజయ్ గుర్తు చేశారు అంటూ అభిమానులు ఈయనను కొనియాడుతున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయగా అప్పుడే ఈయనపై మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విజయ్ రాజకీయ రంగ ప్రవేశం మొదలుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసేవరకు విజయ్ వెంట త్రిష ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
దీనికి తోడు మే 4వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్ళిన త్రిష శ్రీవారి దర్శనం తర్వాత నేరుగా తన ఇంటికి వెళ్లకుండా విజయ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపింది . పైగా శ్రీవారి ప్రసాదాన్ని ఆయనకు అందించింది . ఈరోజు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత..”నేను సూపర్ హ్యాపీగా ఉన్నాను. నా మద్దతు ఎప్పటికీ విజయ్ కే ఉంటుంది” అంటూ వ్యాఖ్యానించింది.. ఇలాంటి సమయంలో వీరికి సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో విజయ్ జోక్యం చేసుకున్నారు.
త్రిష జోక్యంపై ప్రచారం: విజయ్ స్పందన
ప్రస్తుతం విజయ్ ప్రమాణస్వీకారం వేళ ఎక్కడ చూసినా విజయ్ పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలలో సినీ నటి త్రిష జోక్యం ఉంటుంది అంటూ సాగుతున్న ప్రచారానికి పరోక్షంగా విజయ్ స్పందిస్తూ..” నేనే పవర్ సెంటర్.. నా పాలనలో రెండో పవర్ సెంటర్ ఉండరు” అంటూ స్పష్టం చేశారు. మొత్తానికైతే ప్రభుత్వ వ్యవహారాలలో సినీనటి త్రిష జోక్యం ఉంటుంది అని సాగుతున్న ప్రచారానికి ఈ విధంగా పరోక్షంగా విజయ్ చెక్ పెట్టారు అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ ప్రభుత్వ పాలనలో త్రిష జోక్యం అంటూ వస్తున్న వార్తలకు ఈ విధంగా కౌంటర్ పడింది అని చెప్పవచ్చు.
పాలనలో ‘రెండో పవర్ సెంటర్’ ఉండదు: సీఎం విజయ్
విజయ్ ప్రమాణ స్వీకారం బాగానే ఉంది కానీ ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో విజయ్ భార్య, కొడుకు, కూతురు కనిపించకపోవడం అందరిని కాస్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తండ్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భార్య కానీ, కన్నబిడ్డలు కానీ లేకపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా విజయ్ ఆయన భార్య సంగీత మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులకు అప్లై చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తన తల్లి సంగీతకు అండగా ఉన్నాడు. ప్రస్తుతం సంగీత లండన్ లో ఉండగా.. కుమారుడు జాసన్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నాడు. కేవలం ప్రమాణ స్వీకారమే కాకుండా ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పుడు కూడా జాసన్ సోషల్ మీడియా ద్వారా తన తండ్రికి కనీసం అభినందనలు కూడా తెలుపలేదు. ఏది ఏమైనా కుటుంబ పరమైన విభేదాల వల్లే ఇప్పుడు పిల్లలు కొంతకాలంగా తల్లి సంగీత తోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు చేపడుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
త్రిష జోక్యంపై వస్తున్న వార్తలకు విజయ్ కౌంటర్ ఇవ్వడంతో, ఈ వివాదానికి తెరపడింది. తన పాలనలో పూర్తి అధికారం తనదేనని విజయ్ స్పష్టం చేయడంతో, అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


