
📌 Key Points
- ఇరాన్‌తో ఒప్పందం కోసం గడువును పొడిగించిన ట్రంప్ నిర్ణయం
- పాకిస్తాన్ అభ్యర్థన మేరకు దాడులను 14 రోజులు నిలిపివేత
- హార్మూజ్ జలసంధి తెరిస్తేనే గడువు పొడిగింపు షరతు విధించిన ట్రంప్
- ప్రపంచ యుద్ధం తప్పిందని ఊపిరి పీల్చుకున్న దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువును పొడిగించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు 14 రోజుల పాటు దాడులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హార్మూజ్ జలసంధిని తెరిస్తేనే గడువు పొడిగిస్తామని షరతు విధించారు.
ఇరాన్‌కు డెడ్ లైన్ పొడిగించిన ట్రంప్
తమతో డీల్ చేసుకోడానికి ఇరాన్ కు విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు. ఇరాన్ కు విధించిన డెడ్ లైన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేస్తున్నట్టు అంగీకరించారు. అయితే హార్మూజ్ ను తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకునే షరతు మీదనే ఈ గడువు పొడిగించానని, ఈ సీజ్ ఫైర్ రెండువైపులా వర్తిస్తుందని, ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ పై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థలు బ్రేకింగ్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కాగా మంగళవారం సాయంత్రం “ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రి నాశనం కావచ్చు, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు” అంటూ ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని వణికించాయి. మూడో ప్రపంచ యుద్ధం జరగనుందని అంతా భయపడగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
పాకిస్తాన్ అభ్యర్థనను మన్నించిన అమెరికా
ప్రపంచ దేశాలకు ఊరట కలిగించిన ట్రంప్ నిర్ణయం
ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. అయితే, ఇరాన్ యొక్క స్పందన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. చర్చలు సఫలం అవుతాయా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.


